Constables wifes agitation close

constables wife's agitation close

constables wife's agitation close

11.gif

Posted: 08/06/2012 01:44 PM IST
Constables wifes agitation close

      మొత్తానికి రక్షకభటుల సతీమణులు శాంతించారు. రెండు రోజులుగా ఆందోళన చేస్తోన్న ఏపీఎస్పీ బెటాలియన్లలో కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. సెలవుల మంజూరుతో పాటు వేధింపులు ఆపాలంటూ పోలీసు కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. సెలవుల మంజూరు, బయట రేంజ్ లో పనిచేసే విధానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. లంచాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు wifeseeశాంతించారు. కాగా,  ఎపీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలంటూ కొండాపూర్ లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.  ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు‎ నిరసనకు దిగారు. లంచాలు తీసుకొని నెలల తరబడి సెలవులు ఇవ్వకుండా  వేధిస్తున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఐజీ వెంకటేశ్వరరావును అడ్డుకొని దాడికి దిగారు. చెప్పులు విసిరారు. హైదరాబాద్ లో ప్రారంభమైన పోలీస్ కుటుంబ సభ్యుల ఆందోళనలు ఇతర జిల్లాలకు విస్తరించాయి. విజయనగరం, తూర్పుగోదావరి, కడప, ఆదిలాబాద్, నల్గగొండ, నెల్లూరు, అనంతపురం, ఖమ్మం జిల్లాల్లోని బెటాలియన్ల దగ్గర కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
   బయటి రేంజ్ లకు పంపుతూ నెలల తరబడి కుటుంబాలకు దూరం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఉన్నతాధికారుల ఇళ్లల్లో పనులు చేయించుకుంటూ ఆర్డర్లీ వ్యవస్థను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కానిస్టేబుళ్ల కుటుంబీకుల ఆందోళనపై హోంమంత్రి సబితా స్పందించారు. ఆందోళనకు గల కారణాలపై ఉన్నతాధికారులతో చర్చలు జరపాలని నిర్ణయించారు. సమస్య పరిష్కరించకుండా తాత్సారం చేస్తే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని కానిస్టేబుళ్ల కుటుంబీకులు హెచ్చరిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Floods in andhra pradesh
Cyclone route change to jarkhand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles