R k dhawan finally finds love at 74 marries 15 year younger woman achla

congress veteran r k dhawan, wife achla,

Congerss veteran Dhawan is set to introduce his 60-year-old wife Achla, marking a new chapter in his social life.

R K Dhawan finally finds love.gif

Posted: 07/16/2012 03:45 PM IST
R k dhawan finally finds love at 74 marries 15 year younger woman achla

RK-Dhawanప్రేమ ఎప్పుడు... ఎక్కడ... ఎలా... పుడుతుందో తెలియదు. అందుకే ప్రేమని గుడ్డిది అన్నారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు 74 సంవత్సరాల వయస్సులో ప్రేమలో పడి గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. వృద్ధ బ్రహ్మచారి.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు.. ఇందిరాగాంధీ వీరవిధేయుడు.. ఆర్కే ధావన్ 74 ఏళ్ల లేటు వయసులో అచల (60) అనే మహిళతో ఘాటు ప్రేమలో పడ్డారు! అయినవారందరికీ షాక్‌నిస్తూ గుట్టుగా పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో సోమవారం పెళ్లి రిసెప్షన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. జూలై 16.. ఆయన పుట్టిన రోజు (75వ ఏట అడుగుపెట్టనున్నారు) కూడా కావడం విశేషం.

ప్రస్తుతం ధావన్, అచల ఢిల్లీలోని గోల్ఫ్ లింక్స్‌ లో ఆయన నివాసంలోనే కలిసి ఉంటున్నారు. కాగా, అచల ఒక వితంతువు అని, ఆమె భర్త ఒకప్పు డు ప్రైవేట్ విమాన కంపెనీలో పైలెట్‌గా పనిచేసేవారని, ఆమెకు ఒక కుమార్తె ఉన్నదనే వివరాలు మాత్రమే తెలుసు. అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఈ వయస్సులో పెళ్లి చేసుకొని ఏం చేస్తావ్ అని జోకులు వేసుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi plea for narco test on jagan rejected
Women edging ahead in the iq stakes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles