Engineering students adviser

engineering students adviser

engineering students adviser

3.gif

Posted: 07/08/2012 01:49 PM IST
Engineering students adviser

     enggg_ex_innnn ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు ఆదరణ పెరుగుతోంది. దీంతో విద్యార్ధులకు.. తల్లిందడ్రులకు తలెత్తే అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎడ్యు ఎక్స్ పో 2012 పేరిట రెండు రోజులపాటు అవగాహన సదస్సు ఇవాళ కూడా జరుగుతోంది. హైదరాబాద్ వెస్లీ కాలేజీలో ఈ ఎక్స్ పో జరుగుతోంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్ జైన్ ఎక్స్ పోను ప్రారంభించారు. ఇంజనీరింగ్ లో చేరాలనుకొనే విద్యార్థులకు ఎంసెట్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలో ఏయే కాలేజీల్లో సీటు వస్తుందో తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవాలనుకొనే విద్యార్థుల కన్నా ఇంజనీరింగ్ సీట్లే లక్షా 20వేలు ఎక్కువగా ఉన్నాయని అజయ్ జైన్ తెలిపారు. తల్లిదండ్రుల ఒత్తిళ్ళకు లొంగి విద్యార్థులు తమకు ఇష్టంలేని కోర్సుల్లో చేరొద్దని ఆయన సూచించారు. అంతేగాక దేశంలో ఇంజనీరింగ్ విద్యలో కొత్తగా వస్తున్న ప్రత్యేక కోర్సులను ఎంచుకోవడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
     ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత లోపిస్తోందని, దాని సరిచేసుకొనే బాధ్యత కాలేజీ యాజమాన్యాలపై ఉందన్నారు. సీట్లు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు తగిన కాలేజీని ఎన్నుకోవాలని సూచించారు. ఫాకల్టీ వివరాలను కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎడ్యుఎక్స్ పోలో సుమారు 30 ఇంజనీరింగ్  కాలేజీల స్టాళ్ళను ఏర్పాటు చేశారు. విద్యార్ధులలో పెరిగిన పోటీతత్వం వల్ల మంచి ఫలితాలు సాధిస్తూ ముందంజలో ఉన్నారని ఎనర్జీ కోఆర్డినేషన్  కమిటీ మెంబర్ చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఒకప్పుడు ఉన్నత విద్యలను చదివేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని అయితే ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. మరోవైపు ఎడ్యూఎక్స్ పో వల్ల విద్యార్ధులు.. తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యాలు, ఫాకల్టీతో కలిసి మాట్లాడే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు చెప్పారు. మొత్తానికి ఇంజినీరింగ్ విద్యపై విద్యార్ధులతో పాటు తల్లిదండ్రుల్లో ఉన్న సందేహాలను తొలగించేందకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎక్స్ పోలో పాల్గొన వారు హర్షం వ్యక్తం చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Presidential candidate ps sangma says
Vips cue at secunderabad ujjayani temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles