Presidential candidate ps sangma says

presidential candidate ps sangma says

presidential candidate ps sangma says

6.gif

Posted: 07/08/2012 03:09 PM IST
Presidential candidate ps sangma says

      యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీపై ఎన్డీఏ అభ్యర్థి సంగ్మా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రణబ్   మరో రెండుps_sangma లాభదాయక పదవులను  కొనసాగుతున్నారంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బీర్ భూమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉపాధ్యక్షుడిగా, రవీంద్ర భారతి వర్సిటీ ఆద్వర్యంలోని రవీంద్ర భారతి సొసైటీ చైర్మన్ గా ప్రణబ్ కొనసాగుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులను డిమాండ్ చేశారు.  సంగ్మా ఫిర్యాదుపై  కాంగ్రెస్  మండిపడింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారాన్ని దిగజారుస్తున్నారంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సల్ ధ్వజమెత్తారు. ప్రణబ్ అభ్యర్థిత్వంపై సంగ్మా బృందం తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. రవీంద్ర భారతి సొసైటీ పదవి రాజకీయాలకు అతీతమైనదని, అది కేవలం గౌరవ పదవి మాత్రమేనని ఆయన చెప్పారు. ప్రణబ్ జూన్ 20న రాజీనామా చేశారని, దానిని తాము వెంటనే ఆమోదించామని సొసైటీ కార్యదర్శి నబకుమార్ శీల్ మీడియాకు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former up cm mayavati illegal assets case
Engineering students adviser  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles