రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ఉద్యమాలు నిర్వహించే టిడిపి ఇప్పుడు తన ఉద్యమ పంథాను మార్చింది. రైతులకు సంబంధించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన సమస్య ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఆ సమస్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ భవన్‌లో టిడిపి, సిపిఐతో పాటు వివిధ రైతు సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల కోసం భవిష్యత్తులో చేయాల్సిన ఉద్యమాలపై చర్చించారు. రాయలసీమలో రైతులకు రుణాలు లభించక ఇబ్బందులు పడుతున్నారని, రాయలసీమలోని బ్యాంకులను సందర్శించి పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, కౌలు రైతులకు రుణాల చెల్లింపుపై ఉద్యమించాలని నిర్ణయించారు.
కోస్తా జిల్లాల్లో పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం ప్రధాన సమస్యగా ఉన్నందున గిట్టుబాటు ధర కోసం ఆ జిల్లాల్లో ఆందోళనలు జరుపుతారు. తెలంగాణ జిల్లాల్లో విత్తనాలు, ఎరువుల కొరత ఎక్కువగా ఉందని, ఈ సమస్యపై ఉద్యమిస్తామని తెలిపారు. సమావేశం వివరాలను టిడిపి నాయకులు కోడెల శివప్రసాదరావు, సిపిఐ రైతు నాయకులు రామకృష్ణ మీడియాకు వివరించారు. విత్తనాలు లభించక, రుణాలు అందక, బ్లాక్ మార్కెట్‌లో ఎరువులు కొనలేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. రైతుకు వ్యవసాయం అంటేనే భయం కలిగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని , సేద్యం చేసే కన్నా ఉపాధి హామీ జామ్ కార్డు మేలు అని రైతులు భావిస్తున్నారని తెలిపారు. కరవు బాధితులకు 1816 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కేవలం 450 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని తెలిపారు. వైఎస్ హయాంలో రైతులకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో మరెప్పుడూ జరగలేదన్నారు. సెజ్‌ల పేరుతో లక్షలాది ఎకరాల భూములను రైతుల నుండి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. లక్షలమంది రైతులు నిరాశ్రయులు కాగా, డజన్ల మంది పారిశ్రామికవేత్తలను వేల కోట్లకు అధిపతులను చేశారని విమర్శించారు. రైతు రుణాలు మాఫీ చేద్దామని కేంద్రం ప్రతిపాదిస్తే అప్పులు ఎగవేసే వారు పెరుగుతారని వైఎస్‌ఆర్ అన్నారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more