Yanam violence puducherry cm agrees for cbi probe

Yanam Violence: Puducherry CM Agrees For CBI Probe

Yanam Violence: Puducherry CM Agrees For CBI Probe

Yanam.gif

Posted: 07/04/2012 11:08 AM IST
Yanam violence puducherry cm agrees for cbi probe

 కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలో అంతర్భాగమైన యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం జరిగింది. సుమారు రూ.139 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ వ్యవహారంపై ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) దర్యాప్తు జరుపుతోంది. వివరాలిలావున్నాయి.. గోదావరి గట్లు అభివృద్ధికి కేంద్రప్రభుత్వం పుదుచ్ఛేరికి రూ.500 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.139 కోట్లు తమకు కేటాయించాలని కోరు తూ యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి వై లక్ష్మీనారాయణ రెడ్డి పేరు తో ఒక నివేదిక వెళ్ళింది. గత ఏడాది ఎన్నికలకు ముందు హడావిడిగా అప్పటి ప్రాంతీయ పరిపాలనాధికారి పేరును ప్రతిపాదనలపై రాసి దాని కింద డిప్యూటీ కలెక్టర్‌ను చేర్చి పుదుచ్ఛేరి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆ నివేదికను కేంద్ర జలవనరుల సంఘానికి ఆమోదం నిమిత్తం పంపించారు. ఈ మేరకు కొంత నిధులు విడుదలయ్యాయి. అయితే ఆ ప్రతిపాదనలపై తాను సంతకం చేయలేదని అప్పటి ప్రాంతీయ పరిపాలనాధికారి వై లక్ష్మీనారాయణరెడ్డి పుదుచ్ఛేరి ప్రభుత్వానికి తెలియజేయడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. దీంతో ఈ సంఘటనపై విచారణ నిర్వహించాలని కేంద్ర జల వనరుల శాఖను కోరింది.అప్రమత్తమైన కేం ద్రం దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. రంగంలోకి దిగిన సిబిఐ యానాం రెవిన్యూశాఖ డిప్యూటీ తహశీల్దార్ పాటు పలువురు ఉద్యోగులను ప్రశ్నించింది. ఈ మోసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించడానికి సిబిఐ అధికారులు తీవ్రంగా శోధిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp stages dharna on farmers issues
Up cm car bonanza to mlas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles