Sonia gandhis mission andhra

Sonia Gandhi's Mission Andhra

Sonia Gandhi's Mission Andhra

Sonia00.gif

Posted: 07/04/2012 11:20 AM IST
Sonia gandhis mission andhra

Sonia Gandhi's Mission Andhra

కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు జాతీయస్థాయిలో కామ్‌రాజ్ ఫార్ములా అమలు చేయాలని అధిష్ఠానం యోచిస్తోన్న తరుణంలో, రాష్ట్ర పార్టీలో అలజడి ఆరంభమైంది. అధినాయకత్వం ఫార్ములాను అమలు చేస్తే, ఎవరి పదవులకు ఎసరు వస్తుందోనన్న ఆందోళన సీనియర్ మంత్రుల్లో కనిపిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా సీనియర్ మంత్రుల సేవల్ని పార్టీకి ఉపయోగించుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది. రాష్టప్రతి ఎన్నికల తర్వాత పార్టీలోను, ప్రభుత్వంలోను అధిష్ఠానం భారీ మార్పులు తలపెట్టినట్టు దాదాపు కాంగ్రెస్ నేతలంతా బహిరంగంగానే చెబుతున్నారు. అయితే అధిష్ఠానం తలపెట్టిన మార్పులు ఏమిటి, ఎలా ఉంటాయన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. దీంతో ఎవరికి తోచినట్టు వారు తమ అభిప్రాయాల మేరకు ఊహాగానాలు సాగిస్తున్నారు. సీనియర్ మంత్రులను పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని అధిష్ఠానం భావిస్తోందన్న అంశం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అధిష్ఠానం తలపెట్టిన మార్పుల్లో భాగంగా సీనియర్ మంత్రులు కొందరికి పార్టీ బాధ్యతల్ని అప్పగించనున్నట్టు భావిస్తున్నారు. పిసిసి ఉపాధ్యక్షులుగా నియమించి పార్టీని పటిష్టం చేయడం, పార్టీ శ్రేణుల్లో చైతన్యం తీసుకురావడం, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల నాడిని తెలుసుకోవడం వంటి ప్రధాన బాధ్యతల్ని వారికి అప్పగించనున్నట్టు తెలిసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడటం తెలిసిందే. ఉప ఎన్నికల ఫలితాల విశే్లషణతోపాటు, పార్టీ, ప్రభుత్వంలో తీసుకురావాల్సిన మార్పులపై నివేదిక ఇచ్చేందుకు రోడ్లు, భవనాల మంత్రి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో పదిమంది మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఉన్న సీనియర్ మంత్రులు కొందరిని పార్టీకి ఉపయోగించుకోనున్నట్టు తెలిసింది. వీరిలో ప్రధానంగా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆనం రాంనారాయణరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, ఎన్ రఘువీరారెడ్డిలతోపాటు కాసు కృష్ణారెడ్డి, తెలంగాణ ప్రాంతానికి చెందిన కె జానారెడ్డి, డి శ్రీ్ధర్‌బాబు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గం నుంచి వీరిని తప్పించడం అన్నది సామాజిక పరంగా, పార్టీపరంగా అందుబాటులో ఉండే వారిని బట్టి ఆధారపడి ఉంటుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab or sangma for president
Tdp stages dharna on farmers issues  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles