Assam mla second husband beaten up

Assam MLA, second husband beaten up,second- marriage-manhandling, assam mla second marriage, assom mla rumi second marriage, no divorce first marriage

Assam MLA, second husband beaten up

Assam00.gif

Posted: 07/02/2012 10:51 AM IST
Assam mla second husband beaten up

Assam MLA, second husband beaten up

రెండో పెళ్లి చేసుకుందని  ఒక మహిళ ఎమ్మెల్యేని  ప్రజలు  చితకబాదారు. అక్కడితో  ఆగకుండా  రెండో  భర్తకు  కూడా దేహశుద్ది చేశారు.  అసోంలో మొదటి భర్తకు విడాకులివ్వకుండా రెండోపెళ్లి చేసుకున్న కరీంగంజ  కాంగ్రెస్ ఎమ్మెల్యే రూమీ నాథ్‌ను, ఆమె రెండో భర్త జకీ జకీర్‌ను కరీంగంజ్ పట్టణంలో జనం దాడి చేసి కొట్టారని పోలీసులు చెప్పారు. సుమారు 200 మంది జనం పట్టణంలో ఈ ఇద్దరు బస చేసిన హోటల్‌పై దాడి చేసి ఈ ఇద్దరినీ కొట్టి గాయపరిచారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రదీప్ పూజారి చెప్పారు. గత నెల జకీర్‌ను ఎమ్మెల్యే పెళ్లి చేసుకోవడంపై జనం ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారు. దాడిలో గర్భవతిగా ఉన్న ఎమ్మెల్యే, ఆమె రెండో భర్త జకీర్‌కు తీవ్ర గాయాలయ్యాయని, పోలీసులు వెంటనే వారిని తీసుకెళ్లిపోయారని ఎస్పీ చెప్పారు. ఈ ఇద్దరినీ చికిత్స తర్వాత పోలీసు రక్షణలో గౌహతికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బారక్ లోయలోని బోర్‌ఖోలా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రూమీనాథ్ గత నెల తన మొదటి భర్తకు విడాకులివ్వకుండానే జకీర్‌ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. మొదటి భర్త రాకేష్ సింగ్ ద్వారా ఆమెకు రెండేళ్ల కుమార్తె ఉంది. తన భార్య కనిపించడం లేదంటూ ఆయన గత నెల పోలీసులకు ఫిర్యాదు చేసాడు. 

Assam MLA, second husband beaten up

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddi sets july 5th deadline
Minor fire in hyderabads jubilee hall after pranab visit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles