రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి హైదరాబాద్ లో అనుకోని చేదు అనుభవం ఎదురైంది. చెన్నై నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చిన ఆయన .. ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీ హాల్ కు చేరుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహాలులో ఒక్కసారిగా మంటల్లో చెలరేగాయి. రాష్టప్రతి అభ్యర్థిగా యూపీఏ తరఫున పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీ, ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు నిర్వహించిన సమావేశం ముగిసిన కొద్ది నిమిషాలకే ప్రమాదం సంభవించింది. అయితే, అప్పటికే భేటీ ముగియటంతో పెను ప్రమాదం తప్పింది. జూబ్లీహాలు పైకప్పుపై ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో, క్షణాల్లోనే చుట్టూ దట్టమైన పొగ కమ్ముకుంది. అక్కడే ఉన్న కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిఎడి ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాను ఆదేశించారు.
రాష్టప్రతి ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను కలుసుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రణబ్ ముఖర్జీ నగరానికి వచ్చిన సందర్భంగా జూబ్లీహాలులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రణబ్ ముఖర్జీ, తర్వాత అదే ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు ప్రణబ్ వస్తున్న సమయంలోనే క్షణకాలం పాటు విద్యుత్ ఆగిపోయి వెంటనే వచ్చింది. ప్రణబ్ మీడియాతో మాట్లాడి, బయలుదేరిన కొన్ని నిమిషాలకే జూబ్లీహాలు పైభాగాన పెద్దఎత్తున దట్టమైన పొగలు కమ్ముకుని మంటలు చెలరేగాయి. జూబ్లీహాలు వెలుపల ఉన్న పోలీసులు, గన్‌మెన్లు ఇది గమనించి వెంటనే హాలులో ఉన్న కేంద్ర, రాష్టమ్రంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బయటకు పంపించారు. జూబ్లీహాలు వెనుక భాగంలో ఉన్న అగ్నిమాపక శకటం సిబ్బంది జూబ్లీహాలు పైభాగానికి వెళ్ళి, మంటలు ఆర్పేందుకు నీటి పైపు పైకి తీసుకెళ్ళేలోగా మంటలు వ్యాపించి, పొగ నిండిపోవడంతో ఆందోళన కలిగించింది. అరగంట తర్వాత మరో అగ్నిమాపక శకటం అక్కడికి చేరుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్‌రెడ్డి కూడా మంటలు ఆర్పేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. మొత్తానికి మంటలు అదుపులోకి రావడంతో జూబ్లీహాలులో ఫర్నిచర్‌కు ఎటువంటి నష్టం చేకూరలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more