Yeddi sets july 5th deadline

Yeddi sets july 5th Deadline,yeddi group deadline, karnataka crisis, nine ministers resigned, bjp karnataka incharge dharmendra pradhan, yeddyurappa group of ministers, bjp high command, cm sadanandagowda, Panchayat Raj Minister Jagadish Shettar, who is the faction's nominee to replace Gowda,55 MLAs, 5 MLCs, eight MPs attended the meeting

Yeddi sets July 5th Deadline

Yeddi.gif

Posted: 07/02/2012 10:47 AM IST
Yeddi sets july 5th deadline

 Yeddi sets july 5th Deadline

కర్నాటక బిజేపి  అంతర్గత కలహాలు అటోఇటో తేల్చుకునే దశకు చేరుకున్నాయి .  అవినీతి ఆరోపణలతో  సిబిఐ విచారణనెదుర్కొంటున్న మాజీ సీఎం యడ్యూరప్ప  గత కొంత కాలంగా ప్రస్తుత సీఎం  సదానంద గౌడను  దించి తన వర్గం నేతను  సీఎం  పీఠం పై కూర్చోబెట్టాలంటూ  బిజేపి  అధిష్టానంపై  ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు.  ముఖ్యమంత్రి సదానంద గౌడను ఈనెల 5లోగా గద్దె దించాలని మాజీ ముఖ్యమంత్రి యెడ్డీ విధేయ  వర్గం పార్టీ నాయకత్వానికి అల్టిమేటమ్ ఇచ్చింది. ‘మా పార్టీ అధిష్ఠానవర్గం సదానంద గౌడను తప్పించి జగదీష్ షెట్టర్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి మేము 5వ తేదీ వరకూ వేచి చూస్తాం’ అని అసమ్మతి వర్గం సమావేశం అనంతరం వర్గ నాయకుడొకరు మీడియాకు వెల్లడించారు. ‘ఒక వేళ అధిష్ఠానం మా డిమాండ్‌ను అంగీకరించకుంటే 5వ తేదీ తర్వాత రాష్ట్ర పార్టీ విభాగంలో జరిగే పరిణామాలకు అధిష్ఠానవర్గానిదే బాధ్యత’ అని షెట్టర్ నివాసంలో జరిగిన అసమ్మతివర్గం సమావేశం అనంతరం బిజెపి లోక్‌సభ సభ్యుడు సురేశ్ అగాడి చెప్పారు. అధిష్ఠానానికి 5వ తేదీ వరకూ గడువు ఇవ్వాలని తాము నిర్ణయించామని, ఒకవేళ తమ డిమాండ్‌ను అధిష్ఠానం అంగీకరించకపోతే తర్వాత తాము అత్యంత కీలకమైన నిర్ణయాలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రికి రాజీనామాలు సమర్పించిన తొమ్మిదిమంది రాష్ట్ర మంత్రుల్లో ఒకరైన రాజు గౌడ స్పష్టం చేశారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆమోదించడం కోసం ఈనెల 16న సమావేశమయ్యే అసెంబ్లీలో తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్‌ను కోరడం, జగదీశ్ షెట్టర్‌ను కొత్త నాయకుడిగా ఎన్నుకోవడానికి లెజిస్లేచర్ పార్టీ విభాగం సమావేశం నిర్వహించడం ముఖ్యమైన నిర్ణయాల్లో ఉంటాయని పార్టీ వర్గాలు తెలియజేసాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pro telangana protesters greet pranab in hyderabad
Assam mla second husband beaten up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles