Virbhadra singh resigns

Virbhadra Singh,Union minister resigns,Manmohan Singh,corruption charges

A day after a court in Shimla framed corruption charges against him, Union minister Virbhadra Singh resigned from the Cabinet on moral grounds

Virbhadra Singh resigns.gif

Posted: 06/26/2012 04:57 PM IST
Virbhadra singh resigns

Virbhadra_Singhఅవినీతి ఆరోపణలతో మరో కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. హిమాచల్‌ కాంగ్రెస్‌ నేత, కేంద్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి వీరభద్ర సింగ్‌ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదించారు. 78 ఏళ్ల వయసున్న వీరభద్ర సింగ్ తన రాజీనామాను స్వయంగా ప్రధానికి అందించారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్‌మోహన్ సింగ్‌ను కలుసుకుని దాదాపు ఇరవై నిమిషాలపాటు మాట్లాడారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రధానికి చెప్పారు. ఆయన ఇచ్చిన రాజీనామా లేఖను ప్రధాని వెంటనే ఆమోదించారు. అనంతరం ఆ లేఖను రాష్ట్రపతికి పంపించారు. 

తనపై వచ్చిన ఆరోపణల విషయంలో తాను గట్టిగా పోరాడి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటానని కూడా ఆయన చెప్పారు. ఆరోపణలు వచ్చినప్పుడు పదవిలో కొనసాగడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ పరిస్థితిని రానివ్వరాదని భావించడంవల్లే పదవినుంచి తప్పుకుంటున్నట్టు కూడా ఆయన వివరించారు. వీరభద్ర సింగ్ 1989లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడినట్టు సిమ్లా కోర్టు సోమవారంనాడు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil nadu governor rosaiah
Radhika to enter active politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles