Pjrs daughter ministers son meet jagan

PJRs daughter, Ministers son meet Jagan,, Vijaya, daughter of former Congress Legislature Party leader P. Janardhan Reddy and Krishna, son of Ministe,

PJRs daughter, Ministers son meet Jagan

PJRs.gif

Posted: 06/21/2012 12:58 PM IST
Pjrs daughter ministers son meet jagan

PJR’s daughter, Minister’s son meet Jagan

ఉపఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్‌పార్టీలో ముఠా తగాదాలు మరింత పెంచాయి. పైకి నవ్వుకుంటూనే లోలోపల ముఖ్యనేతలు కత్తులు నూరుకుంటున్నారు. ఫలితాలకు నీవంటే నీవే కారణమంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఉపఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకోకుండా బొత్స, కిరణ్‌ ఒకరినొకరు ఏ విధంగా పదవుల నుండి ఎలా దించుకోవాలన్న దానిపై యత్నాలు చేసుకోవడంతో విసుగెత్తిన నేతలంతా ఎమ్మెల్యేలతో పాటు జగన్‌వైపు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని మంత్రుల, సీనియర్‌ నాయకుల తనయులు జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం చంచల్‌గూడ జైలులో జగన్‌కు పిజెఆర్‌ కుమార్తె విజయారెడ్డి, మంత్రి విశ్వరూప్‌ తనయుడు కృష్ణ సంఘీభావం ప్రకటించడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్‌ మునిగితేలుతుండగా ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేలే గాకుండా నేతలంతా భవిష్యత్తులో జగన్‌వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నేత అంబటి రాంబాబు సెలవిచ్చారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని బతికున్నన్ని రోజులు పి.జనార్దన్‌రెడ్డి(పిజెఆర్‌) నీళ్ళు తాపించిన విషయం తెలిసిందే. ఒకేపార్టీలో ఉన్నా ఇద్దరు బద్ధ వ్యతిరేకులు. 2004లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్‌కు పిజెఆర్‌ వణుకు పుట్టించారు. అలాంటి కుటుంబంలో పుట్టిన విజయారెడ్డి కూడా జగన్‌ను కలవడంతో ఇప్పటివరకు కాంగ్రెస్‌ను కాస్తోకూస్తో నమ్ముకున్న ద్వితీయశ్రేణి నేతలు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలంటున్నారు. కాంగ్రెస్‌ వ్వవహారాలపై పిజెఆర్‌ తనయుడు, ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఆయన కూడా అంటీముట్టనట్లుగానే ఉంటూ వస్తున్నారు. 2014 నాటికి ఆయన కూడా కాంగ్రెస్‌లో ఉంటారా అనేది అనుమానాస్పదమేనని ప్రచారం జరుగుతోంది. జగన్‌ను కలిసిన తర్వాత విజయారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి పిజెఆర్‌ మరణించిన తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తమను బాగా ప్రోత్సహించారని అన్నారు. తనను రాజకీయాల్లోకి రావాలని వైఎస్సార్‌ కోరారని చెప్పారు. కావాలనే జగన్‌ వ్యతిరేకంగా కుట్రలు సాగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా కేబినెట్‌ మంత్రిగా ఉన్న విశ్వరూప్‌ కుమారుడు కృష్ణ కూడా జగన్‌ను కలవడం కూడా చర్చనీయాంశమైంది. తాను జగన్‌ను కలవడానికి రాలేదని మోపిదేవిని మాత్రమే కలిశానని మీడియాకు చెప్పారు. లోపలి ఎవరిని కలిశారని మొదట మీడియా అడగగా చెప్పకుండా పరుగులు తీశారు. తర్వాత మాట్లాడుతూ వివరణ ఇచ్చుకున్నారు. ఇలా జైలు వద్ద జగన్‌ను కలిసేందుకు వస్తున్న నేతల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. జగన్‌ అరెస్టు అయితే ఎమ్మెల్యేల వలసలు తగ్గుతాయని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఆశించినా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి అడ్డుకట్టు వేయలేకపోతోంది. కాంగ్రెస్‌కు మొదట్నుంచి అండగా ఉంటున్న కుటుంబాలు కూడా జగన్‌కు మద్దతివ్వడంతో సీనియర్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ కలుసుకోవడం కూడా కాంగ్రెస్‌ను పెద్దకుదుపే కుదుపుతోంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తోనూ రాష్ట్రంలో జగన్‌తో కలిసి పని చేయడానికి ఎంఐఎం యోచిస్తున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్‌తో పాటు అన్నిపార్టీల నుండి తమ పార్టీలోకి వలసలు పెరగనున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. జగన్‌ సతీమణి భారతి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మీ, వంగవీటి రాధాకృష్ణలతోపాటు జగన్‌ను అంబటి రాంబాబు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో పెద్దఎత్తున అన్నిపార్టీల నుండి వలసలు రాబోతున్నాయన్నారు. త్వరలో జగన్‌ జైలు నుండి బయటకు వస్తారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seven cups of tea a day raises risk of prostate cancer
Chandrababu fire on jagan party a sakshi paper  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles