Chandrababu fire on jagan party a sakshi paper

Chandrababu fire on Jagan party & Sakshi paper

Chandrababu fire on Jagan party & Sakshi paper

Chandrababu.gif

Posted: 06/21/2012 11:03 AM IST
Chandrababu fire on jagan party a sakshi paper

Chandrababu fire on Jagan party & Sakshi paper

తనపై తప్పుడు రాతలు రాయించి, చేసిన తప్పు నుండి తప్పించుకోజూస్తున్నారని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సాక్షి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు చెప్పే ధైర్యం లేక ఇతరులపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. తనకు అకౌంట్లు ఉన్నాయని కోలా కృష్ణమోహన్‌ చెప్పేవన్నీ కట్టుకథలేనన్నారు. తన పేరున ఉన్నట్లు రుజువు చేస్తే వారే తీసుకోవచ్చు అని పునరుద్ఘాంటించారు. బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు యూరో లాటరీ వచ్చిందని రూ 10 లక్షలు పార్టీకి చందా ఇచ్చారని వెల్లడించారు. ఆది తప్పుడు పద్దతుల్లో వచ్చిందనే విషయం తమ ప్రభుత్వ విచారణలో తేలిందన్నారు. అందుకే ఆతని చేతిలో మోసపోయిన వారికి ఆ డబ్బు చెందాలనే ఉద్దేశంతో ఆ పది లక్షలను కోర్టులో డిపాజిట్‌ చేశామన్నారు. తనకు అకౌంట్లు ఉన్నాయని చెబుతున్న వాటి వివరాలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. నారావారి పల్లె, పుల్లావారిపల్లెలో కొంత మంది పేర్లను వేసి వాళ్లకు మారిషస్‌లో అకౌంట్లు ఉన్నాయని రాశారని, వీటిలో ఒక్క అమ్మాయి పేరు తప్ప ఆ పేర్లు కలిగి ఉన్న వాళ్శు ఎవరూ ఆ గ్రామంలో లేరన్నారు. ఆ అమ్మాయిది కూడా ఇంట్లో నుంచి బయటకు రాని కుటుంబమన్నారు. ఈడీకి రూ 50 లక్షలు ఇచ్చి మేనేజ్‌ చేశారని చెప్పడం బురదజల్లడానికి పరాకాష్ట అన్నారు.తనపై హత్యాయత్న ప్రయత్నం జరిగిందంటూ కోలా కృష్ణమోహన్‌ చెప్పడాన్ని చూస్తే అతని ప్రాణాలకు ముప్పు ఉందని అర్థమవుతుందన్నారు. దానిపై విచారణ జరిపించాలని తాను డిజిపికి లేఖ రాస్తానని చెప్పారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన ఆ పేపర్‌కు విలువలు, విశ్వసనీయత ఉంటే వాళ్శు ప్రచురించిన పేర్లు వివరాలు వెల్లడించాలన్నారు. ధైర్యం ఉంటే తనపై రాసిన కథనాలను రుజువు చేయాలని డిమాండ్‌ చేఖశారు. లేదంటే సిగ్గుతో తలదించుకుని క్షమాపణ చెప్పాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pjrs daughter ministers son meet jagan
Maoists kidnap 19 railway employees release all of them later  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles