Bobbili mla resigns from congress

Venkata Sujay Krishna Ranga Rao Ravu, bobbili Mla, jagan, Jagan, Enforcement Directorate, CBI, security, national radar, jagan mohan reddy

As expected the Bobbili MLA Venkata Sujay Krishna Ranga Rao Ravu has formally resigned his membership from the ruling Congress party, today at Bobbili. Mr Ranga Rao was elected twice from the same constituency which was considered, the iron hold of the Congress

Bobbili MLA resigns from Congress.gif

Posted: 05/30/2012 05:48 PM IST
Bobbili mla resigns from congress

Ranga-raoవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నా.. ఆయన పార్టీలోకి వచ్చే వారు మాత్రం ఆగడం లేదు. సీబీఐ విచారణప్పటినుండి ఆయన వెంట ఉన్న బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు నేడు పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్సార్ పార్టీలోకి చేరడానికి రెడీ అయ్యారు, దీంతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు గట్టి దెబ్బ అనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గం నుంచి రంగారావు వరుసగా రెండుసార్లు విజయ కేతనం ఎగురవేశారు. మంత్రి పదవిని ఆశించారు. అయితే బొత్స కుటుంబ హవా నేపథ్యంలో రంగారావుకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీనితో జిల్లా రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈయన ఒక్కడే కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది. పార్వతీపురం శాసనసభ్యురాలు సవరపు జయమణి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు సమాచారం వస్తోంది. ఆమె రంగారావుతో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరో శానససభ్యుడు కూడా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కురుపం శానససభ్యుడు జనార్దన్ కూడా వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలను అరికట్టడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysrcp complaint against adhinayakudu
Ap govt slashes sales tax on petrol  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles