Ap govt slashes sales tax on petrol

AP Govt slashes sales tax on petrol.gif

Posted: 05/30/2012 05:47 PM IST
Ap govt slashes sales tax on petrol

3--taxఈ మధ్యనే భారీగా పెంచిన పెట్రోలు రేట్లను కాస్త తగ్గించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోలు పై ఇప్పుడున్న పన్నును 3 శాతం తగ్గించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈసీ అనుమతి తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. సీఈసీ అనుమతి లభించిన వెంటనే పెట్రోలుపై మూడు శాతం పన్ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభత్వ నిర్ణయంతో రాష్ట్రంలో రూ.1.50 నుంచి రూ.1.80 పైసల వరకు పెట్రోలు ధర తగ్గే అవకాశం ఉంది.  పెట్రోల్ రేట్ల పై ఆయిల్ కంపెనీలు కూడా కాస్త మెత్తబడ్డట్టు ఉన్నాయి. పెంచిన రేట్ల పై 70 పైసల వరకు తగ్గించాలని సూత్ర ప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

ప్రభుత్వం పెట్రోల్ రేటు తగ్గించడాన్ని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ తగ్గింపు ఉప ఎన్నికల స్టంట్‌గా విపక్షాలు పేర్కొంటున్నాయి. పార్టీలను ఎదుర్కొన లేకనే కిరణ్ ప్రభుత్వం ఈ ప్లాన్ వేసిందని అంటున్నారు. ఉప ఎన్నికలపై పెట్రోలుపై పన్ను శాతం తగ్గింపు ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ తగ్గించే రేట్లు ఉప ఎన్నికల తరువాత నుండి అమలు కావచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bobbili mla resigns from congress
Jagan mohan reddy turns chanchalguda into party office  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles