Ysrcp complaint against adhinayakudu

MP YS Jaganmohan Reddy's YSR Congress party leaders complaint against Nandamuri Hero Balakrishna's Adhinayakudu film on Wednesday. They complaint in election commission to stop Adhinayakudu release before bypolls

MP YS Jaganmohan Reddy's YSR Congress party leaders complaint against Nandamuri Hero Balakrishna's Adhinayakudu film on Wednesday. They complaint in election commission to stop Adhinayakudu release before bypolls

Ysrcp complaint against adhinayakudu.gif

Posted: 05/30/2012 08:57 PM IST
Ysrcp complaint against adhinayakudu

Adhinayakudu-film

నందమూరి బాలక్రిష్ణ నటించిన ‘అధినాయకుడు’ సినిమాకి కష్టాలు తప్పడం లేదు. ఇన్ని రోజులు ఆర్థిక కష్టాలలో ఉన్న ఈ సినిమా ఎలాగొలాగా బయటపడింది. కానీ బాలయ్య అతి ప్రవర్తనతో మళ్లీ కష్టాలు కొని తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా రేపు విడుదల అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే ఈ సినిమా పై సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అధినాయకుడు చిత్రంలోని డైలాగులు ఓ పార్టీని ఉద్దేశించే విధంగా ఉన్నాయని వారు మండిపడ్డారు. ఓ పార్టీకి చెందిన డైలాగ్స్ ఉన్నాయన్నారు. రెండు రోజుల క్రితం బాలకృష్ణ మాట్లాడుతూ... అధినాయకుడు చిత్రాన్ని ఉప ఎన్నికల ప్రచారం కోసం పంపిస్తున్నామని చెప్పారని, ఆ వ్యాఖ్యలపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా వుంటే ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాలకృష్ణ నటించిన అధినాయకుడు చిత్రం విడుదలను నిలిపి వేయాలని అధినాయకుడు చిత్రంలో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సినిమాలో బాలకృష్ణ వేసిన సెటైర్‌లపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అదే సమయంలో ఉప ఎన్నికల ప్రచారానికి తాను రాకపోయినప్పటికీ తన సినిమాను పంపిస్తున్నానని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కూడా వారు ప్రస్తావించారు.

దీని పై స్పందించిన ఈసీ 'అధినాయకుడు' సినిమాపై ఫిర్యాదు అందిందని, నిపుణుల కమిటీతో ఆ సినిమాను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. టిడిపి ప్రచారానికి 'అధినాయకుడు' ఉపయోగపడేలా ఉంటే చర్యలు తప్పవన్నారు. అవసరమైతే ఆ సినిమా నిర్మాణ వ్యయాన్ని టిడిపి అభ్యర్థుల ఖర్చులో కలుపుతామని హెచ్చరించారు. మరి రేపు విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian expat in italy murders wife for being westernized
Bobbili mla resigns from congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles