Petition filed on sachin rajyasabha member ship issue

petition filed on sachin rajyasabha member ship issue

petition filed on sachin rajyasabha member ship issue

9.gif

Posted: 05/17/2012 12:14 PM IST
Petition filed on sachin rajyasabha member ship issue

      మాస్టర్ బ్లాస్టర్ రాజ్యసభకు అర్హుడు కాడా.. అంటే.. కానేకాడంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కొందరు. తాజాగా సచిన్  టెండూల్కర్ ను రాజ్యసభకు పంపడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్టికిల్ 80ప్రకారం రాజ్యసభకు సచిన్ అర్హుడు కాడంటూ, ఆయన సభ్యత్వంపై తక్షణం స్టే ఇవ్వాలని, ప్రమాణ స్వీకారం చేయకుండా నిలుపుదల చేయాలని పిటిషనర్  కోరారు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపికను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.  sasaరాజ్యసభ సభ్యుడిగా సచిన్ ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే విధించాలని మధురై బెంచ్ లో బెనిట్టో అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ప్రమాణస్వీకారం చేయకుండా ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. పిటిషనర్  అభ్యంతరాలపై కౌంటర్ ఫైల్  చేయాలని మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. సచిన్ ఎంపికపై సినీతారలు, క్రికెటర్లు రాజ్యసభలో చేసేదేమీ ఉండదని బాల్ థాకరే వ్యాఖ్యానించగా మహారాష్ట్ర నవనర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే మాత్రం సమర్థిస్తున్నారు. సచిన్ ను రాజ్యసభకు పంపటం పట్ల సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజాగా ఇలాంటి పిటిషన్ లు వేయటం అందరి ద్రుష్టినీ ఆకర్షిస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  How to increase memory power
Ysr congress party seen reverse  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles