How to increase memory power

how to increase memory power..?

how to increase memory power..?

13.gif

Posted: 05/17/2012 12:30 PM IST
How to increase memory power

     మెమరీ పవర్ ఎక్కువ ఉంటే ఎవరైనా జమ్సే కదా.. చూసిందల్లా టక్కున పట్టేస్తే చాలా విషయాల్లో దూసుకుపోవచ్చు. విద్యార్థులేకాదు. పెద్దల విషయానికొచ్చినా. చదివింది మర్చిపోవటం, విన్నది, చూసింది సమయానికి గుర్తుకు రాకపోవటం మనిషి ఉన్నతికి ఆటంకం.  చిన్నపిల్లల నుంచి పెద్దవారిదాకా.. అందరికీ 'పరీక్ష' పెట్టే పెద్ద సమస్య మతిమరపు! దీని చాలా వరకూ దూరం చేసేందుకు ఇప్పుడు ఓ మార్గం దొరికింది. ఈ ఇబ్బందికి నేరేడు గింజలు బ్రహ్మాండంగా చెక్ పెడతాయని వరంగల్‌జిల్లా హన్మకొండలోని సెయింట్ పీటర్స్ ఫార్మసీ కళాశాలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.Syzygium-cuminiaa
      జ్ఞాపశక్తి పెంచే ఔషధం కోసం.. ఈ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఆకొండి బుచ్చిరాజు నేతృత్వంలోని బృందం రెండు సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తోంది. నేరేడు గింజలు ఎంతో మేలైనవని వీరి పరిశోధనలో తేలింది. జపాన్ సొసైటీ ఆఫ్ చైల్డ్ న్యూరాలజీ ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనే అంతర్జాతీయ సైన్స్ జర్నల్‌లో ఈ రిసెర్చ్ ఫలితాలు ప్రచురితమయ్యాయి.
కాగా, మనిషిలో జ్ఞాపక శక్తి అనేక కారణాలతో క్రమంగా తగ్గుతుంది. తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం కాగా..అల్జీమర్స్ లాంటి వ్యాధులు కూడా జ్ఞాపకశక్తిని హరిస్తాయి.  మెదడులో 'అసిలైట్ కోలెన్' అనే రసాయన ఉత్పత్తి తగ్గడంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.
     నేరేడు గింజల్లో ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్లు, టానిన్స్, ఆస్కార్బిక్ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. జ్ఞాపకశక్తి తగ్గిన ఎలుకలపై ఇవి ఎంతో ప్రభావవంతంగా పని చేశాయని ప్రొఫెసర్ రాజు  తెలిపారు. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో భవిష్యత్తులో దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి నేరేడు గింజల నుంచి తయారు చేసిన మందును మనుషులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mca files complaint against shah rukh khan
Petition filed on sachin rajyasabha member ship issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles