Cm kiran kumar reddy fire on y s jagan

CM Kiran kumar reddy fire on Y S Jagan,CM Kirankumar seriously fired on Y.S.Jagan

CM Kiran kumar reddy fire on Y S Jagan

CM.gif

Posted: 05/08/2012 09:59 AM IST
Cm kiran kumar reddy fire on y s jagan

CM Kiran kumar reddy fire on Y S Jagan

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే జగన్‌పై ఆయన నిప్పులు చెరిగారు. తండ్రి చాటున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని, ఇపుడు రాజకీయాలనే వ్యాపారంగా చేసుకుని డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ నాయకుడని, ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారన్నారు. ఎవరినీ పార్టీ వదిలి వెళ్లవద్దని ఆయన చెప్పేవారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి పక్కన ఉండి వ్యాపారాలు చేసుకుంటూ జగన్ వేల కోట్లు సంపాదించారని, కానీ అలా సంపాదించిన డబ్బుతో 70 నుండి 80పడక గదులతో లక్ష చదరపు అడుగుల్లో ఎవరైనా భవనాన్ని నిర్మించుకుంటారా? అని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇల్లు చాలా స్వల్ప విస్తీర్ణంలో ఉంటుందన్నారు. అలాంటిది ప్రజానాయకుడిగా ఎదగాలనుకునే వారు, అందులోనూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న కోరికతో ఉన్న వారు ఇలాంటి పనులు చేయరన్నారు. 

తండ్రి చనిపోయిన తరువాత ఇక రాజకీయాన్నే వ్యాపారంగా మార్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్న జగన్‌ను ప్రజలు జాగ్రత్తగా గమనించాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న కెసిఆర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్రతో జగన్ ఉన్నారన్నారు. దీనిని తిప్పికొట్టే కార్యక్రమం రామచంద్రపురం నుండే ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  It companies in hyderabad
Jagan casecbi files second chargesheet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles