It companies in hyderabad

it companies in hyderabad

it companies in hyderabad

it companies.gif

Posted: 05/08/2012 10:11 AM IST
It companies in hyderabad

it companies in hyderabad

మరోవైపు ఐటి రంగంలో అభివృద్ధి విస్తరణ లోపించిందని, దెబ్బతిన్న ఐటి రంగానికి మార్గనిర్దేశనం చేసేందుకు పదిమంది ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ అనిశ్చితి, ఆందోళనలతో రాష్ట్రంలో ఐటి రంగం ఢమాల్ అయ్యింది. 2011-12 ఆర్థిక సంవత్సరం పూర్తయి నెల గడచినా, ఇంతవరకు ఐటి ఎగుమతుల విలువను చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాహసించడం లేదు. 1998లో 250కోట్ల రూపాయల విలువ చేసే ఐటి ఉత్పత్తులతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ఐటి మహా ప్రస్తానం చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తారాస్థాయికి చేరుకుంది. వైఎస్ మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఐటి రంగం కుదేలైంది. 2010-11లో ఐటి ఉత్పత్తుల ఎగుమతుల విలువ 36 వేల కోట్ల రూపాలయలకు చేరుకుంది. కాని 2011-12లో ఐటి ఉత్పత్తుల విలువ 40 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. సర్వసాధారణంగా పెరిగే విలువ తప్ప, గతంతో పోలిస్తే ఇది అభివృద్ధి కాదని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఐటి రంగంలో అభివృద్ధి మందగించిందని స్వయంగా అంగీకరించింది.

ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోని ఐటి కంపెనీల్లో మొత్తం 2.7 లక్షలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2014-15 నాటికి అదనంగా 1.25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. 2014-15 నాటికి 70 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఐటి ఉత్పత్తుల ఎగుమతులు చేయాల్సి ఉంది. కానీ ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని తేలిపోయింది. 2009-10లో 32 వేల కోట్లు, 2010-11లో 36వేల కోట్ల రూపాయల వరకు ఐటి ఎగుమతులు జరిగాయి. ప్రస్తుతం పరోక్షంగా 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. నాస్కాం అంచనాల ప్రకారం సాలీనా 15 నుంచి 20 శాతం వృద్ధిరేటు ఉండాలి. నాస్కాం ప్రకారం రాష్ట్రం నుంచి ఐటి ఎగుమతుల విలువ 42 వేల కోట్ల రూపాయలు దాటాల్సి ఉంది.

it companies in hyderabad

హైదరాబాద్‌లో ఐటి రంగం అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల వౌలిక సదుపాయాలు ఉన్నాయి. చైనా, ఇండోనేషియా తర్వాత ఆ స్థాయిలో వౌలిక సదుపాయాలు ఉన్న నగరం హైదరాబాద్ కావడం విశేషం. గత ఏడాది కూడా అంతర్జాతీయ స్థాయిలో ఐటి రంగంలో పెట్టుబడులు ఇనెవస్ట్ చేసేందుకు అనువైన 9వ నగరంగా హైదరాబాద్ పేరు సంపాదించింది. కాని 2014-15 నాటికి 70 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఐటి ఉత్పత్తుల ఎగుమతులు చేయడం, అదనంగా 1.25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం అసాధ్యంగా మారిందని ఐటి నిపుణులు అంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో అంచనాలకు మించి ఈ రంగంలో అభివృద్ధి జరిగి ఉండేది. కాని 2009-12 సంవత్సరాల మధ్య హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆందోళనల వల్ల ప్రభుత్వం కూడా ఏమీ చేయని స్థితిలో ఉండిపోయింది.
హైదరాబాద్‌లో 1300 వరకు ఐటి కంపెనీలున్నాయి. మాదాపూర్, గచ్చ్భిలి, కొండాపూర్‌లో ఐటి కంపెనీలున్నాయి. ఉప్పల్, పోచారం, షామీర్‌పేట, శంషాబాద్‌లో కొత్త ఐటి కంపెనీల ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలు ఆశాజనకంగా సాగడం లేదు. ఐటి రంగం కోసం 9 మిలియన్ల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

కాని కొత్త కంపెనీలు ఆశించిన రీతిలో తమ కార్యకలాపాలను ప్రారంభించడం లేదు. మహేశ్వరం, ఉప్పల్‌లో కేంద్రం సహకారంతో రెండు గ్రీన్‌ఫీల్డ్ ఐటి సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విశాఖపట్నం, తిరుపతి, వరంగల్‌లో కూడా ఐటి టూ టైర్ సిటీలుగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నాలకు స్పందన లేదు. గత ఏడాది మార్చి 1, 2 తేదీల్లో అడ్వాంటేజ్ ఏపి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఐటి రంగం అభివృద్ధి కోసం చేసిన సదస్సుకు పెద్దగా స్పందన కనపడలేదు. అధికార, విపక్ష రాజకీయ పార్టీల స్వప్రయోజనాలకు పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టే వారిని ఇరికించడం, దర్యాప్తు ఏజన్సీలు రంగంలోకి దిగడం తదితర పరిణామాలు చూసి ఐటి, ఫార్మా రంగంలో పెట్టుబడులు ఇనెవస్ట్ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఒక వాణిజ్య పరిశ్రమల సంస్థ ప్రతినిధి తెలిపారు. 

it companies in hyderabad

ఇటీవల హైటెక్ సిటీలో మణికొండలో ఐటి కంపెనీలకు స్థలం కేటాయించిన భూమి ఒక మతానికి సంబంధించిన సంస్థ భూమిగా హైకోర్టు నిర్ధారించడంతో, అక్కడున్న కంపెనీలు ఖంగుతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా తమకు వివాదాలకు దారితీసే భూములను కేటాయించడంపై కూడా ఐటి కంపెనీలు కనె్నర్ర చేసినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Visakhapatnam
Cm kiran kumar reddy fire on y s jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles