Archipelago cinema the floating movie theater

Archipelago Cinema , the Floating Movie Theater

Archipelago Cinema , the Floating Movie Theater

Movie Theater.gif

Posted: 04/14/2012 10:15 AM IST
Archipelago cinema the floating movie theater

Archipelago Cinema , the Floating Movie Theater

చల్ల చల్లని కూల్ కూల్ అంటూ.. ప్రేక్షకులు హాయిగా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ‘సీటింగ్’ మరింత సౌకర్యవంతంగా ఉండేట్లు థియేటర్లలో ఏర్పాటు చేసిన మెత్తని కుర్చీలు.. ప్రేక్షకులను హంస తూలికాతల్పంపై కూర్చున్న అనుభూతికి గురి చేశాయి. ప్రేక్షకుడు ఇంకా సౌకర్యవంతంగా సినిమా చూడాలంటే ఏం చేయాలి? అని భావించి... హాయిగా కాళ్లు చాపుకుని, వయ్యారంగా వెనక్కి వాలిపోయి వెండితెరను వీక్షించే వీలుగా కుర్చీలను డిజైన్ చేశారు. అయితే ఇవి మల్టీప్లెక్స్ థియేటర్‌కి మాత్రమే పరిమితమయ్యాయి. ఇలా కాళ్లు చాపుకు కూర్చుని.. సినిమాలు చూడటమే ఓ వింత అయితే.. థాయ్‌ల్యాండ్‌లో మరో వింత జరిగింది. ఏకంగా సముద్రం మీద థియేటర్ కట్టేసి, వీక్షకులను ఆనందాశ్చర్యాలకు గురి చేయడమే కాదు, వారిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఈ ‘ఫ్లోటింగ్ థియేటర్’ (తేలే థియేటర్)ని కట్టాలనుకోవడానికి కారణం అక్కడ జరిగిన చలన చిత్రోత్సవాలు. ఇటీవల థాయ్ ల్యాండ్‌లో ‘ఫిలిం ఆన్ ది రాక్స్ యో నాయ్ ఫెస్టివల్’ జరిగింది.

Archipelago Cinema , the Floating Movie Theater

సాగరంపైన విందు

మూడు పగళ్లు, నాలుగు రాత్రులు జరిపే ఈ చలన చిత్రోత్సవాలు వీక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి ఇవ్వాలని నిర్వాహకులు భావించారట. ఆ ఆలోచనకు కార్యరూపమే ‘ఫ్లోటింగ్ థియేటర్’. కుడూ ఐల్యాండ్‌కి వెళ్లినవారికి ఈ తేలే థియేటర్ ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. ఈ థియేటర్‌కి ‘ఆర్చిపిలాగో’ అని నామకరణం చేశారు. జర్మనీకి చెందిన ఆర్కిటెక్ ఓలే షీరెన్ ఈ ‘ఫ్లోటింగ్ థియేటర్’ నిర్మాణం చేశారు. మత్స్యకారులు తయారు చేసుకునే బల్లకట్ట, చెక్క వంతెనని ఆదర్శంగా తీసుకుని ఈ థియేటర్‌ని తయారు చేశారు. రెండు కొండరాళ్లకు ముందు అమర్చిన తెర, దానికి కొద్ది దూరంగా వీక్షకులు కూర్చుని చూడటానికి అనువుగా తయారు చేసిన బల్లకట్టలాంటి వేదిక, దానిపైన మెత్తటి కుర్చీలతో ఈ ‘ఫ్లోటింగ్ థియేటర్’ని ఏర్పాటు చేశారు. 60మంది ప్రేక్షకులు వీక్షించడానికి వీలుగా ఈ థియేటర్ నిర్మించారు. పడవ ప్రయాణమే ఓ మంచి అనుభూతి అంటే.. అందులో ప్రయాణించి, ఫ్లోటింగ్ థియేటర్‌కి వెళ్లి, సినిమా చూడడం మరో గొప్ప అనుభూతి. ఈ చిత్రోత్సవాల్లో భాగంగా సినిమాలను ప్రదర్శించడంతో పాటు 101 వర్క్‌షాపులు నిర్వహించారు. అలాగే అతిథులకు విందు కూడా సాగరం పైనే.

Archipelago Cinema , the Floating Movie Theater

థాయ్ వండర్

కేవలం చిత్రోత్సవాల కోసం మాత్రమే ఈ తేలే థియేటర్‌ని ఏర్పాటు చేశారు. ఇది ‘థాయ్‌వండర్’ అని చిత్రోత్సవాల్లో పాల్గొన్నవారు నిర్వాహకులను ప్రశంసలతో ముంచెత్తారు. ఫిలింఫెస్టివల్ పూర్తయిన తర్వాత ఈ థియేటర్‌ని ఊడదీశారు. కానీ నిర్మాణానికి వాడిన చెక్కలు, ఇతర సామగ్రి పునరుపయోగించడానికి వీలుగా ఉండటం విశేషం. ఆ చుట్టుపక్కల ఉన్న ఓ గ్రామానికి ఈ సామగ్రిని ఇచ్చారట. ఇప్పుడు తాత్కాలికంగా ఈ తేలే థియేటర్‌ని కట్టిన నిర్వాహకులు.. భవిష్యత్తులో శాశ్వతంగా ఉండే వీలుగా నిర్మాణం చేపట్టడానికి కుదురుతుందా అనే దిశలో ఆలోచిస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే.. థాయ్‌లో ఇది మంచి సందర్శనా స్థలం అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Professor arrested for poking fun at cm mamata
A british inventor has created a baby car seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles