K keshava rao spits fire in rs on telangana

Kesava Rao, the retiring Congress member, has lambasted the UPA government over its apathy with regard to granting Telangana in the Rajya Sabha on Monday. Dr Kesava Rao confronted the government on the issue and said already over 700 youngsters had laid down their lives for the cause of Telangana. He angrily questioned whether the UPA government would give Telangana, after the number crossed the 1000 mark.

K Keshava rao spits fire in RS on Telangana.GIF

Posted: 03/27/2012 03:51 PM IST
K keshava rao spits fire in rs on telangana

Keshava-raoకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు రాజ్యసభలో తన ఆఖరి స్పీచ్ ని అదరగొట్టాడు. ఆఖరి స్పీచ్ అని ఎందుకు వాడవలసి వచ్చిందంటే.... ప్రస్తుత రాజ్యసభ్య ఎన్నికలకు కే. కేశవరావు టిక్కెట్ రాలేదు. కాబట్టి అతను మళ్ళీ రాజ్యసభలో అడుగు పెట్టలేడు. తనకు పదవి రాలేదని కోసంతోనో లేక తెలంగాణ రాష్ట్రం కోసం నేను సైతం పోరాడుతున్నానని చెప్పడానికో కానీ మొత్తానికి స్పీచ్ ఇరగదీశాడు.  "అసలేం జరుగుతోంది? తెలంగాణ ఆకాంక్ష కోసం మరింత మంది చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా? వెయ్యి మంది చనిపోవాలా? మూడు కోట్ల మంది చనిపోవాలా? ఉద్యమాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను. నేను సిద్ధం, ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. చనిపొమ్మంటే చనిపోతాం. మేమంతా అడుగుతోంది ఒక్కటే.. మీరు ఏం చెప్పారో అది చేయండి చాలు'' అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేశవరావు అన్నారు.

ఒక ప్రాంతంలోని అసెంబ్లీ సభ్యులు, మంత్రులు, ఎంపీలంతా రాజీనామా చేసిన సంఘటనలు దేశంలో ఏమైనా ఉన్నాయా? ప్రజాస్వామ్య గళాన్ని వినిపించుకోకుంటే పార్లమెంటు అనే పదానికి అర్థం ఉందా? ప్రజాస్వామ్యం వల్ల లాభం ఏముంది?'' అని ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వగలరని కేకే ఆశాభావం వ్యక్తం చేశారు. "తెలంగాణపై నెహ్రూ, లాల్‌బహుదూర్ శాస్త్రి, రాజీవ్ మాట్లాడలేకపోయారు. నరసింహారావూ తేల్చలేకపోయారు. సోనియాగాంధీయే హామీ ఇచ్చారు. సోనియా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. ఆమె నాయకత్వంలోనే కొత్త రాష్ట్రం ఏర్పాటువుతుంది'' అని కేకే విశ్వాసం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకూ 609 ఆత్మహత్యలు జరిగాయని, ఇంకా ఎంతకాలం ఇవి  జరగాలని ఆయన ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Goa proposes to reduce petrol price by rs 11 ltr
James cameron takes voyage to the deep  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles