James cameron takes voyage to the deep

James Trench , Mariana Avatar Titanic (Movie) James Cameron Mariana Trench Final a06 Oceania Guam The Daily Telegraph PHOT OTCT N JPG Cameron , James James Cameron

The film director surfaced Monday from the first solo dive to the bottom of the world's deepest ocean to declare that it looked like a desolate lunar landscape

James Cameron takes voyage to the deep.GIF

Posted: 03/27/2012 03:22 PM IST
James cameron takes voyage to the deep

James-Cameronఒక ఊహా లోకంలో జరిగే విముక్తి పోరాటాన్ని ‘అవతార్’ గా తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం నమోదు చేసిన ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ నిజ జీవితంలో కూడా ఓ సంచలనం నమోదు చేశాడు. 57 ఏళ్ళ జేమ్స్‌ కామెరూన్‌ సముద్ర అగాధాల్లో రహస్యాల ఛేదనకు దిగాడు. గత 52 ఏళ్ళలో ఎవరూ చేయని ఈ సాహసంలో భాగంగా భూమిపై అత్యంత లోతైన ప్రదేశమైన పసిఫిక్‌ మహా సముద్రంలోని మెరియానా ట్రెంచ్‌ అగాధంలోకి ఒంటరిగా జలాంతర్గామిలో వెళ్ళి తిరిగి వచ్చాడు. ఈ అగాధాన్ని అన్వేషించిన మూడో వ్యక్తిగా జేమ్స్‌ రికార్డు సృష్టించాడు. అయితే మెరియానా ట్రెంచ్‌ లోతులకు ఒంటరిగా ప్రయాణించిన తొలివ్యక్తి జేమ్స్‌ అని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ ప్రకటించింది. 1960 జనవరి 23న స్విట్జర్లాండ్‌కు చెందిన జాక్వెస్‌ పికార్డ్‌, అమెరికన్‌ డాన్‌ వాల్ష్‌లు కలిసి ఈ అగాధంలోకి వెళ్ళివచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ఎవరూ ఆ సాహసానికి పూనుకోలేదు. అయితే రోబోట్‌లు మాత్రం ఈ లోతుల్లో ఆన్వేషణలు సాగించాయి.

ఈ సముద్ర అగాధ యాత్రలో భాగంగా జేమ్స్‌ సోమవారం, ఉదయం సరిగ్గా 7గంటల 52 నిమిషాలకు 10898 మీటర్ల (11 కిలోమీటర్లు)లోతైన మెరియానా ట్రెంచ్‌ అగాధంలోకి చేరుకున్నారు. ఈ అగాధ యాత్ర పూర్తి చేయటానికి జేమ్స్‌ కు రెండున్నర గంటల 36 నిమిషాలు పట్టింది. యాత్రా పూర్తయిన తర్వాత జేమ్స్‌ మాట్లాడుతూ సముద్రంలోని భూతలంపై ఏమీ లేదని ‘అదో ప్రత్యేక ప్రపంచం. నేను అంతరిక్షంలో ఉన్న భ్రాంతిని పొందాను. వేరే గ్రహంపైకి వెళ్ళి మళ్ళీ భూగ్రహం పైకి వచ్చిన విధంగా ఉందని జేమ్స్‌ తన అనుభవాన్ని తెలిపారు. సముద్రంలోతుల్లోకి వెళ్ళటం పట్ల జేమ్స్‌ కు చిన్నప్పటి నుంచే అసక్తిని కలిగివున్నారు. ఇప్పటివరకు 72 సార్లు సముద్ర లోతుల్లోకి ప్రయాణించారు. 1997లో జేమ్స్‌ తీసిన టైటానిక్‌ సినిమా సందర్భంగా దాని అవశేషాలను చిత్రీకరించటానికి ఆ నౌక మునిగిన ఉత్తర అట్లాంటిక్‌ సముద్రం లోతుల్లోకి 33 సార్లు వెళ్ళారు. ప్రస్తుతం ఆ సినిమా 3డీ వెర్షన్‌లో వచ్చే నెలలో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  K keshava rao spits fire in rs on telangana
Popcorn is healthier than fruits  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles