Goa proposes to reduce petrol price by rs 11 ltr

Goa, petrol price, petrol, Manohar Parrikar,VAT, BJP, assembly polls

In a step that will make petrol in Goa the cheapest in India, chief minister Manohar Parrikar has proposed a reduction in prices of the fuel by Rs 11 per litre in the state.

Goa proposes to reduce petrol price by Rs 11 Ltr1.GIF

Posted: 03/27/2012 04:08 PM IST
Goa proposes to reduce petrol price by rs 11 ltr

Petrol-rateఏప్రిల్ 1 నుండి పెట్రోల్ చాలా చీప్. ఇక పై పెట్రోల్ ధర 55 రూపాయలే. అదేంటి మిమ్మల్ని ఫూల్ చేయడానికి మాత్రం చెప్పడం లేదు. మరేంటి ఒక్కసారిగా ఇంత తగ్గింది అని ఆశ్చర్యపోకండి. నిజమే కానీ మన రాష్ట్రంలో కాదు గోవాలో. అవును గోవాలో ఏప్రిల్ 1 నుండి పెట్రోల్ రేటు 55 రూపాయలే. ఇంత తక్కువకు ఎలా వస్తుంది అంటే... అక్కడి పాలకుల పనితీరుతో.

వివరాల్లోకి వెళితే... పెట్రోల్‌ ఛార్జీలు పెరగడమే కానీ... తగ్గడం అరుదైన ఈ రోజుల్లో గోవా ప్రభుత్వం వినూత్న నిర్ణయంతో ప్రజలపై భారాన్ని తగ్గించింది. ఇటీవలి ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ మనోహర్‌ పారీకర్‌ సారథ్యంలోని బిజెపి సర్కారు పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా లీటర్‌ పెట్రోల్‌ రేటు పదకొండు రూపాయలు తగ్గింది.

ఈ నిర్ణయానికి ముందు లీటర్‌ పెట్రోల్‌ ధర 66 రూపాయలు కాగా.. పారీకర్‌ నిర్ణయంతో 55 రూపాయలకు తగ్గనుంది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో వ్యాట్‌ తగ్గింపును ప్రతిపాదించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారీకర్‌ ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పద్నాలుగు లక్షల మంది వాహన వినియోగ దారులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రకటించారు. ఈ తగ్గింపు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. మరి మన రాజకీయ ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల పై భారం తగ్గిస్తుందో....?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Danam nagender
K keshava rao spits fire in rs on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles