Now megastar chiranjeevi is member of parliament

now megastar, chiranjeevi, is member of parliament

now megastar chiranjeevi is member of parliament

14.gif

Posted: 03/18/2012 02:37 PM IST
Now megastar chiranjeevi is member of parliament

          chiru_prp ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి, ప్రజలకు సేవ చేయాలన్న చిరంజీవి ఆశలు అప్పటి ఎన్నికల ఫలితాల్లో నీరుగారినప్పటికీ, మరో రకంగా చిరు అధికారంలోకి వచ్చేశారు. ఎంతో కష్టపడి సినిమా రంగంలో మెగాస్టార్ అయిన చిరంజీవి, రాజకీయాల్లో తొలుత కింద పడ్డా తనదే పైచేయి అని నిరూపించుకుని జీవితంలో తనకు అపజయమనేదే లేదని నిరూపించుకున్నారు. అంతేకాదు పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తనను నమ్ముకుని పార్టీలో ఉన్న వారికి మంత్రి పదవులతో పాటు అధికారాన్నీ అందించగలిగారు చిరు. విలీనం చేసేస్తున్నారంటూ అప్పట్లో బాధపడ్డ పీఆర్పీ అభిమానులంతా ఇప్పుడు చిరు సరైన నిర్ణయం చేశారని ఇప్పుడు తెగ సంతోష పడిపోతున్నారు.chiru_cong
            కాగా, తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ నేత చిరంజీవికి రాజ్యసభ సీటు ఖరారు అయ్యింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ ఆజాద్ ఇవాళ (ఆదివారం) రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై తుది చర్చలు జరిపారు. రెండో సీటు ఇతర రాష్ట్రాల నేతలకు వెళ్లనుండగా, మూడు, నాలుగు సీట్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉప ఎన్నికల పోలింగ్ ముగిశాక అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం.
           కాగా, ఢిల్లీలో రాజ్యసభ ఎన్నికల హడావిడి జోరందుకుంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో తమ ప్రమేయం లేదని అంతా హైకమాండ్‌ నిర్ణయమేనని ఇవాళ ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్ర బడ్జెట్‌ వల్ల మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశం కలిగిందన్నారు. బడ్జెట్‌లో ఎన్జీ రంగా వర్శిటీకి 100 కోట్ల రూపాయలు విడుదల చేయడం సంతోషకరమన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Up minister azam khan oth in second time
Cycle sawari starts on neckless road  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles