Most intelligent boy

most intelligent american,most intelligent people,most intelligent people of 2011,top 10 intelligent people,top 10 intelligent people in the world,top 10 most intelligent people in the world,education,entertainment,people

List of the top 10 Most Intelligent people in the world, Genius people in the world by the year 2011

most intelligent people.GIF

Posted: 03/13/2012 02:50 PM IST
Most intelligent boy

Akruthఏడేళ్ల పిల్లాడు చేసే పనులేంటి... స్కూలుకెళ్లి బుద్ధిగా చదువుకోవడం, ఇంటికొచ్చి అల్లరి చేయడం ఇంతేగా! ఇవి మామూలు పిల్లాడి లక్షణాలు... ఆకృత్‌వి కాదు. చిచ్చరపిడుగులందరితో ఓ సామ్రాజ్యం ఏర్పాటుచేస్తే హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆకృత్ జస్వాల్ దానికి రాజు లాంటి వాడన్నమాట. ఈ పద్దెనిమిదేళ్ల కుర్రాడి వద్ద చాలా విశేషాలే ఉన్నాయి.

సరిగ్గా ఏడేళ్లకు అందరూ బడికి వెళ్తుంటారు కదా. ఆకృత్ ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లాడు. ఏడేళ్ల వయసులో ఎనిమిదేళ్ల చిన్నారికి ఆపరేషన్ చేసి అతి పిన్న సర్జన్‌గా వినుతికెక్కాడు. ఆకృత్ ఐక్యూ 146. ఇండియాలో తన వయసు వారిలో ఇతనే అత్యధిక ప్రజ్ఞావంతుడు. ఆకృత్‌కు సైన్సు అంటే మహా ఇష్టం. అందులో అనాటమీ ఇంకా ఇష్టం. ఆ చిన్నారి అధ్యయనం మీడియాకు ఎక్కడంతో స్థానిక వైద్యులు అతడి తెలివితేటలను పరీక్షించారు. వాటికి ముగ్ధులై ఆరేళ్లలోనే తాము చేసే సర్జరీలు చూడటానికి అనుమతించేవారు. దాంతో అనాటమీ గురించి కూలంకషంగా చదవడంతో పాటు, ప్రత్యక్ష అనుభవం ద్వారా ప్రాక్టికల్‌గా నేర్చుకోవడానికి ఎవరికీ రాని అవకాశం అతడికి వచ్చింది.

ఆకృత్ ఏడేళ్ల వయసులో ఉన్నపుడు అతడి గురించి ఆనోటా ఈనోటా విన్న ఓ నిరుపేద కుటుంబం తమ కూతురు అగ్నిప్రమాదానికి గురై పిడికిళ్లు మూసుకుపోయి మొండి చేతులతో జీవిస్తోందని అతని వద్దకు వచ్చింది. తమకు ఆస్పత్రి ఖర్చులు భరించే స్థోమత లేదని చెప్పడంతో ఆకృత్ చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఆ చిన్నారికి విముక్తి కలిగించాడు. అప్పుడు అతను హీరో అయిపోయాడు.‘నువ్వు చేసిన పని చట్టవిరుద్ధం.ఈ విషయం నీకు తెలుసా?’ అని అతడిని ప్రశ్నిస్తే ‘అవును, అది చట్టవిరుద్ధమే కానీ, నేను చేసింది మేలే. పైగా ఎటువంటి హాని చేయని, మంచి చేసే మేలు’ అంటూ తన పనిని సమర్థించుకున్నాడు. ప్రభుత్వం కూడా ప్రత్యేక వ్యక్తిగా అతడిని గుర్తించింది. పన్నెండేళ్లకే పంజాబ్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ మెడిసిన్ చదివాడు. ప్రస్తుతం అప్లయిడ్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A woman has been raped in a moving car
Kowada projects info  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles