Kowada projects info

Kowada - Projects Info,NPCIL, NPCIL is an undertaking of the government of India,8 village, 1992 government,

Kowada - Projects Info

Kowada.gif

Posted: 03/13/2012 11:40 AM IST
Kowada projects info

Kowada - Projects Info

‘అణువు’ కదలబోతోంది..అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో కొవ్వాడలో ఆరు వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న అణుపార్కు నిర్మాణానికి అన్ని రకాల సన్నాహాలూ తుది దశకు చేరుకున్నాయి. అత్యంత కీలకమైన భద్రత సహా...ఏయే గ్రామాలు ఖాళీ చేయాలి? అణుకేంద్ర రక్షణ పరిధిలోకి ఏయే గ్రామాలొస్తాయి? ఎంత భూమి అవసరం..అన్నీ సమగ్రంగా అత్యున్నతస్థాయిలో వివరాలను విశ్లేషించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల సహాయంతో అక్షాంశ రేఖాంశాల ఆధారంగా అతి సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేసి అణురియాక్టర్లను ఎక్కడ ఏర్పాటు చేసేదీ గుర్తించారు. మరోవైపు భారత నావికాదళానికి చెందిన అధికారులు, సైనికులు వివిధ కోణాల్లో కొవ్వాడ ప్రాంతాన్ని జల్లెడ పడతున్నారు. కొవ్వాడలో అణువిద్యుత్ కర్మాగారం నిర్మించాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. 1992 నుంచి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. చివరకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ఇప్పటికే సర్వేలు పూర్తిచేసి నివేదికలు సిద్ధం చేసింది. సత్వరమే భూసేకరణ చేసి స్థలం తమకు అప్పగించాలని అణుపార్కు అధికారులు ఇటీవల ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని కోరగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వానికి కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, జూన్ నాటికి శంకుస్థాపన జరిగిపోవాలని సూచించింది. దీంతో ఆఘమేఘాలపై అధికారులు కొవ్వాడ భూసేకరణలో నిమగ్నమయ్యారు.

ఇందుకుగాను ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌తోపాటు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలుగా పెద్దకొవ్వాడ, చినకొవ్వాడ, టెక్కలి, రామచంద్రపురం, కోటపాలెం, అల్లివలస, జీరుకొవ్వాడ, గూడేం గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలన్నీ ఖాళీ చేయించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఈ గ్రామాలు ఖాళీ కావడంతో 862 కుటుంబాలు నిర్వాసితులుగా మిగులుతారు. వీరికి సంబంధించిన 520.29 ఎకరాల భూసేకరణ తప్పనిసరిగా చేయాల్సి ఉంది. అణుపార్కు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు రెవెన్యూ యంత్రాంగం పలు చోట్ల స్థలాలు పరిశీలించింది. ఎన్.జి.ఆర్.పురం పంచాయితీ, జీరుపాలెం దగ్గరలో, కొత్తముక్కాం పక్కనే స్థలాలు రెవెన్యూశాఖ పరిశీలనలో ఉన్నాయి. కొవ్వాడ పంచాయితీ ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడే కాలనీ నిర్మిస్తామని న్యూక్లియర్ అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Most intelligent boy
Special on adilabad by elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles