Narayana group enters the gulf

A top coaching center of Andhra Pradesh, which prepares students for entrance examinations of professional medical and engineering courses, is set to launch their business in the Gulf. Coaching giant Narayana group has entered the market of United Arab Emirates and launched an aggressive campaign to enroll students for its maiden batches which will start later this month.

A top coaching center of Andhra Pradesh, which prepares students for entrance examinations of professional medical and engineering courses, is set to launch their business in the Gulf. Coaching giant Narayana group has entered the market of United Arab Emirates and launched an aggressive campaign to enroll students for its maiden batches which will start later this month.

Narayana group enters the Gulf.GIF

Posted: 03/12/2012 01:23 PM IST
Narayana group enters the gulf

Narayanaఇంజనీరింగ్, వైద్య పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కోచింగ్ సెంటర్లు ఇక గల్ఫ్‌ లో కూడా అడుగు పెడుతున్నాయి.  వృత్తి, విద్య పోటీ పరీక్షలకు ప్రవాసాం«ద్రుల పిల్లలను సన్నద్ధం చేయడానికి రాష్ట్రానికి చెందిన నారాయణ గ్రూప్.. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో ప్రవేశించింది. ఇందుకోసం అబూదాబీ, షార్జా నగరాలలో ఏర్పాట్లు చేసుకొన్న నారాయణ గ్రూప్ దుబాయిలోనూ అధికారికంగా అనుమతి కొరకు దరఖాస్తు చేసింది. రెండు బృందాలుగా వాద్యార్ధులకు కోచింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. సెలవు దినాలైన శుక్ర, శనివారాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చె విధంగా మరో బృందాన్ని కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు నారాయణ గ్రూప్ గల్ఫ్ ఇన్‌చార్జి యల్.జి.రావు ఒక ప్రకటనలో తెలిపారు.

టోఫెల్, సాట్ పరీక్షలకు ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. గల్ఫ్‌లోని ప్రముఖ భారతీయ పాఠశాలల సహాయంతో కోచింగ్ కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళిక రూపొందిస్తుంది. భారతదేశంలో కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో శిక్షణాకేంద్రాలు నిర్వహిస్తున్న నారాయణ గ్రూప్ ఇప్పుడు యు.ఏ.ఈలో నివసిస్తున్న తెలుగు విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొంది. గల్ఫ్ దేశాలలో మొత్తం 82 భారతీయ పాఠశాలలుండగా నిరుడు 12వ తరగతిలో 90.67 ఉత్తీర్ణత శాతంతో స్వదేశీ విద్యార్ధుల కంటే మెరుగైన ఫలితాలను సాధించడం జరిగింది. సుమారు 20వేల మంది విద్యార్ధులు గల్ఫ్‌లో 10-12వ తరగతిలో చదువుతుండగా వీరికి పోటీ పరీక్షల కోచింగ్ ప్రాధాన్యత కల్గింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prajarajyam party merge in congress party officially
Hyderabad people gets drinking water from krishna river  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles