Hyderabad people gets drinking water from krishna river

hyderabad, people gets ,drinking water from krishna river

hyderabad people gets drinking water from krishna river

11.gif

Posted: 03/12/2012 01:22 PM IST
Hyderabad people gets drinking water from krishna river

          mahedhar_reddy భాగ్యనగర వాసుల నీటి కష్టాలు త్వరలో తీరబోతునాయి. ఇప్పటికే జంట నగరాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమౌతున్నారు. బోర్లు పనిచేయక నీటికోసం ట్యాంకర్లమీదే ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తింది. అయితే తాజాగా ఈ ఉపద్రవానికి ఊరడింపు లభించబోతోంది.
           2014 చివరి నాటికి కృష్ణా మూడోదశ ద్వారా హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తామని పురపాలక శాఖమంత్రి మహీధర్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో హైదరాబాద్‌లో నాగునీటి కొరత గురించి విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు ఇచ్చారు. 2017 నాటికి గోదావరి నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తామని చెప్పారు. నగరంలో వాల్టా చట్టం అమలుకు టాస్క్‌ ఫోర్స్‌ ను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. AP_Legislative_Assembly
           అయితే, మంత్రి సమాధానంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాగునీటి సమస్య దారుణంగా ఉన్నా మంత్రి మభ్యపెడుతున్నారని విపక్షాలు ఆరోపించాయి. మంత్రి సమాధానంపై ఎంఐఎం నిరసన వ్యక్తం చేసింది. తాగునీటి సమస్యపై ప్రభుత్వం మాటలతో మభ్యపెడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. మంచినీటి సరఫరాపై స్పీకర్‌ సూచన మేరకు నగర ఎమ్మెల్యేలతో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narayana group enters the gulf
Subbishetty died  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles