జర్నలిస్ట్, అతన్ని కుటుంబాన్ని అమానుషంగా కత్తితో పొడిచి చంపిన ఉదంతం మధ్యప్రదేశ్ ఉమేరియా లో వెలుగుచూసింది. 42 సంవత్సరాల చంద్రికారాయ్, అతని భార్య 40 సంవత్సరాల దుర్గ, 19 సంవత్సరాల కుమారుడు జలజ్, 17 సంవత్సరాల కూతురు నిషా లను వారి నివాసంలోనే హంతకులు పదునైన వస్తువుతో పొడిచి చంపారు. వారి శవాలు వేరు వేరు గదుల్లో లభించాయి. రోజంతా తలుపులు తెరవకపోయేసరికి అనుమానం వచ్చిన రాయ్ సోదరుడు శనివారం సాయంత్రం తలుపులు బలవంతంగా తెరిచి లోపలిసి ప్రవేశించటంతో ఈ విషయం తెలిసింది.
చంద్రికా రాయ్ కొంత కాలంగా అక్రమ బొగ్గు తవ్వకాల మీద రాస్తూ వచ్చారు. హిందీ దిన పత్రిక నవభారత్, ఇంగ్లీషు దిన పత్రిక హిత్వాద లకు ఫ్రీలాంసింగ్ లో వార్తలు రాస్తూ వస్తున్న రాయ్ స్థానిక భాజపా నాయకుడి అక్రమ బొగ్గు తవ్వకాల గురించి సీరియల్ లా రాసుకొస్తున్నారు. ఉమేరియాలో నిజానికి బొగ్గు గనుల సంస్థ సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఆధీనంలోనే గనుల తవ్వకాలు జరగాలి కానీ అక్రమ తవ్వకాలు ఆ ప్రాంతంలో మామూలైపోయింది.
రాష్ట్రంలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్, కర్కశంగా కలం నోరు నొక్కెయ్యటానికి బొగ్గు మాఫియా వెనకాడలేదని, భాజపా స్థానికి మైనింగ్ మాఫియాకు కొమ్ముకాస్తోందని, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు వేదికలమీద మాపియా నాయకులను చూడటం జరుగుతోందని, అలాంటప్పడు నేరస్తులకిక చట్టమంటే భయమెందుకుంటుందని, వారి కార్యకలాపాలకు అడ్డు వచ్చినవారిని హింసాత్మకంగా అడ్డు తొలగించటం, అందుకు చట్టం నుంచి రక్షణ పొందటం కూడా సంభవిస్తున్నప్పుడు వాళ్లెందుకు వెనకాడుతారంటూ ధ్వజమెత్తారు.
అయితే దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కోణమే కాకుండా మరో రెండు కోణాలను కూడా పరిశీలిస్తున్నారు. అందులో, స్థానికంగా ఒక వ్యక్తితో భూ తగాదా ఒకటుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more