Today maha shivaratri celebrations

Today Maha shivaratri Celebrations1

Today Maha shivaratri Celebrations.

Today Maha shivaratri Celebrations.GIF

Posted: 02/20/2012 12:34 PM IST
Today maha shivaratri celebrations

Today_Maha_shivaratri

ఓంకార స్వరూపుడైన పరమేశ్వరుడిని కొలిచి తరించే పండుగ మహాశివరాత్రి. ఈరోజు భోళా శంకరుని పూజిస్తే కోరిన కోరికలు తీరడమే కాకుండా.. పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. భక్తవశంకరుడు, మహాదేవుని భక్తితో కొలిచి పూజిస్తే జన్మజన్మల పాపం తొలగుతుందని ప్రతీతి. దీంతో.. అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరనామ స్మరణతో మార్మోగుతున్నాయి.

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్ని ఆలయాల్లో ఓంకార నాదం మార్మోగుతోంది. ప్రతీ ఏడాది మాఘ బహుళ చతుర్ధశినాడు వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈసందర్భంగా సమస్త లోకాలకూ శుభాన్ని కలిగించే ఆ పరమేశ్వరుడిన్ని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయాల్లో జ్యోతులు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అర్చనలు, పూజలు చేసి ... మంగళప్రదుడైన ఉమాపతిని పూజించి తరిస్తున్నారు.

ఈ పవిత్ర దినాన మహాదేవుని అభిషేకించి.. రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రంగా శివనామస్మరణతో జాగరణ చేస్తే మరుజన్మ ఉండదని శివపురాణం చెబుతోంది. విశ్వమంతటికీ దివ్యజ్ఞాన జ్యోతిని ప్రసాదించిన సమయమే మహాశివరాత్రి అని భక్తుల నమ్మకం. ఈ పుణ్యదినాన విశ్వాంతరాల నుంచి భూమిని చేరే శబ్ధ తరంగాలు శివభక్తులను పునీతం చేస్తాయని ప్రతీతి. జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని..పూజ, భజన, లీల,శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. రాత్రంతా మేల్కొని పంచాక్షరి మంత్రమైన ఓం నమశ్శివాయను జపిస్తూ శివసేవలో తరిస్తే మరుజన్మ ఉండదని భక్తుల అచంచల విశ్వాసం.

శంకరునికి వేలాది నామాలున్నా ... లింగ రూపంలోనే దర్శనమిచ్చే పరమేశ్వరుడు ... సర్వ జనులలో చెడు ప్రభావాన్ని పారదోలుతాడని భక్తుల విశ్వాసం.. హరహర మహాదేవ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Journalist entire family subjected to gruesome murder
Sachin to go for emri for head injury  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles