Pingali venkaiah family members

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Pingali Venkaiah family members.gif

Posted: 02/08/2012 03:07 PM IST
Pingali venkaiah family members

మన మూడు రంగుల జాతీయ పతాకం చూడగానే మనకు ఎక్కడిలేని ఉత్తేజం వస్తుంది. మరి జాతీయ పతాకంలో ఉండే ఆమూడు రంగులు రూపొందించింది ఎవరయ్యా అంటే మనకు గుర్తుకు వచ్చేది పింగళి వెంకయ్య. ఈయన మన జాతీయ పతాక రూపశిల్పి. మరి అలాంటి మహ నీయుని రక్తసంబంధీకు లు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఒక గుడి వద్ద యాచన చేస్తూ అత్యంత దయనీయం గా బతుకు ఈడ్చుకు వస్తున్నారు. పింగళి వెంక య్య స్వయాన సోదరుడి కుమార్తె ఎనిమిది పదుల వయసున్న ఘంటశాల జయలక్ష్మి ఇప్పుడు ఎవరికీ పట్టనివారే అయ్యారు.

ఆగష్ణు 15, జనవరి 26 రాగానే మన నాయకులు జెండాను ఎగుర వేస్తారు. దానికి ఓ పది రోజుల నుండే హడావుడి చేస్తారు. మరి ఆ జెండా రూపశిల్పికి సంబంధించిన రక్త సంబంధీకులు ఉన్నారా ? ఉంటే వారికి ఏమైనా ప్రభుత్వం తరుపున అందుతున్నాయా ? ఆలోచించరు. అలాంటి నాయకుల రాజకీయం కింద నలిగిపోతున్నారు పింగలి వెంకయ్య రక్త సంబంధీకలు.

ఏలూరు లోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద మిగతా యాచకులతో పాటు కొన్నేళ్లుగా జయలక్ష్మి కుటుంబం యాచన చేస్తూ బతుకుతున్నారు. ఇద్దరు కొడుకులతో రోడ్డుపక్కనే జీవిస్తున్నారు. అయితే జయలక్ష్మి వయసు మీదపడడం, ఆమె ఇద్దరు కుమారు లు తమ కుటుంబ నేప«థ్యాన్ని నేరుగా వివరించే స్థితిలో లేకపోవడంతో, వీరిని పింగళి రక్తసంబంధీకులుగా ఎవరూ గుర్తించలేదు. స్థానికులు వీరిని యాచకులగానే చూస్తూ వస్తున్నారు. జయలక్ష్మి భర్త భాస్కరరావు కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన వారు.ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. వృత్తిలో ఉండగానే సుమారు 30 ఏళ్ల కిందటే కన్నుమూశారు. అచ్చటి నుంచి జయలక్ష్మి ఏలూరుకు చేరుకున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఆమె రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వరస్వామి గుడిని ఆసరాగా ఎంచుకున్నారు. అక్కడే ఓ మూలన ఒదిగి కాలం గడుపుతున్నారు. గుడికి వచ్చే భక్తులు తోచి న సాయం చేస్తే సరేసరి. లేదంటే అంతే సంగతి. అయినా ఏనాడూ కూడా తాను పింగ ళి రక్తసంబంధీకులమని నోరెత్తి చెప్పలేదు. వయోభారంతో, కదలలేని స్థితిలో ఉన్న ఆమె తనకు పింగళి వెంకయ్య పెదనాన్న అవుతారని మాత్రం సమాధానం చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Health minister dl ravindra reddy cool now
Famous medaram jatara in telangana region starts from today onwards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles