Health minister dl ravindra reddy cool now

health, minister ,dl ,ravindra ,reddy, cool now ,

health minister dl ravindra reddy cool now

12.gif

Posted: 02/08/2012 03:47 PM IST
Health minister dl ravindra reddy cool now

dlఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మొత్తంమీద వెనక్కితగ్గారు. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా శాఖ కుదింపు పై బహిరంగంగానే ఒకింత అసహనం ప్రదర్శించిన డీఎల్ ఎట్టకేలకు చల్లబడ్డారు. మంత్రి పదవిలో కోతపై తనకు అసంతృప్తి లేదని, శాఖపై అసంతృప్తితో రాజీనామా చేసే ఆలోచనలో తాను లేనని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు.

botsaసీఎల్పీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో ముచ్చటించారు. పదవులు ఇవ్వాలన్నా.. కుదించాలన్నా అది ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుందన్నారు. పదవుల కోసం గడ్డి కరిచే వాళ్లు పార్టీలో ఉన్నారని తాను అలాంటివాన్ని కాదన్నారు. పార్టీ కోసం పనిచేసే తనను తప్పు చేయమంటే చేయనని, అవసరమైతే రాజకీయాలను వదులుకోవడానికి సైతం సిద్దమని డీఎల్‌ చెప్పారు.

damodara_rajaఇదిలా ఉండగా డీఎల్ ప్రశాంతతకు కారణం అధిష్ఠానం బుజ్జగింపులేనని తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌ బొత్సతో డీఎల్‌ భేటీ ఇవాళ రెండున్నర గంటల పాటు సాగింది. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని డీఎల్‌కు ఆజాద్‌ ఫోన్‌ ద్వారా చెప్పినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్శింహ నిర్వర్తిస్తోన్నశాఖలు సైతం కుదించిన నేపథ్యంలో డిప్యూటీతో కూడా ఆజాద్‌, సీఎం, బొత్స, డీఎల్‌లు మాట్లాడినట్టు తెలిసింది.

c_rama_charndraమరోవైపు, ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలు మీడియా సృష్టేనని దేవాదాయశాఖ మంత్రి సి రామచంద్రయ్య ఇవాళ తిరుపతిలో కొట్టిపారేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former cm of andhra pradesh rosaiah associate vaibhav jewellers grandhi manoj kumar missing
Pingali venkaiah family members  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles