Famous medaram jatara in telangana region starts from today onwards

famous, medaram jatara ,in telangana, region, starts ,from today onwards,

famous medaram jatara in telangana region starts from today onwards

9.gif

Posted: 02/08/2012 03:01 PM IST
Famous medaram jatara in telangana region starts from today onwards

         medram తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. సారలమ్మను గిరిజన సాంప్రదాయ పద్ధతిలో కన్నేపల్లి నుంచి ఊరేగిస్తూ జంపన్నవాగు మీదుగా తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించటంతో జాతర మొదలైంది. సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరగానే జాతరలో తొలిగట్టం ముగుస్తుంది.
          sammakkaకాగా, ఈ జాతర ను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలలనుంచే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో మేడారం తరలివస్తున్నారు. ఒడిబియ్యంతో తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
         medaram_jata కాగా, మేడారం ఆలయ పరిసరాల్లో అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది.  లడ్డూ తయారీ కేంద్రంలో వంటలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భక్తుల తాత్కాలిక బస కోసం ఏర్పాటు చేసిన రెండు గుడిసెలు, ఒక టెంట్‌ దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది. వాలంటీర్లు మంటలను ఆర్పారు.
           medaraఇదిలా ఉంటే, మేడారం జాతరకు వెళ్తున్న భక్తులకు ఆర్టీసీ సర్‌ఛార్జీ భారం మోపింది. సర్‌ఛార్జీతో టికెట్‌ ధరలు పెరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సర్‌ఛార్జీని ఉపసంహరించుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్‌ చేసింది. మరోవైపు సమయానికి బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక ఆగ్రహానికి గురైన భక్తులు అధికారులను నిలదీశారు. రెండు బస్సులను ధ్వంసం చేశారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pingali venkaiah family members
Divorce hotel helps couples untie the knot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles