Tirumala venkateswara temple

Tirumala Venkateswara Temple,Venkateswara Swamy temple dedicated to Lord Venkateswara,– Sri Venkateswara Swamy temple

Tirumala Venkateswara Temple

Tirumala.gif

Posted: 01/27/2012 06:42 PM IST
Tirumala venkateswara temple

Tirumala Venkateswara Templeతిరుమల తిరుపతి దేవస్థానం హైందవ ధర్మపరిరక్షణ కోసం ధర్మప్రచారానికి నెలవైన శ్రీవారి ఆలయాలను దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కార్యనిర్వహణాధి కారి ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడించారు. గురువారం గణతంత్ర దినోత్సవ వేడు కల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన నగరా లైన కన్యాకుమారి, కురుక్షేత్రం మొదలైన ప్రాంతాల్లో ఆలయాలను నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో శ్రీవారి ఆల యాన్ని నిర్మిస్తూ శ్రీరామనవమి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం సంతోషదాయకమన్నారు.
హైందవ మతానికి మూలకందాలై వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సంహితలను అర్థ, తాత్పర్య, వ్యాఖ్యా నాలతో ప్రచురించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని నెలకొల్పేందుకు తితిదే కృషి చేయనున్నది. ప్రాచీన గ్రంథాల సేకరణలో తితిదే ప్రజా సహకారాన్ని కోరిందన్నారు. తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన 12 వేల సంకీర్తనలను రాగి, తాళ్లపత్రాలను అత్యాధునిక సాంకేతిక, శాస్ర్తీయ పద్ధతుల్లో పదిలం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే దక్షిణ ఉత్తరాది బాషలతోపాటు ఆంగ్లం కూడా ముద్రించి భావితరాలకు అందించే ఉద్దేశంతో పురావస్తు ప్రదర్శన శాలలో ప్రదర్శిస్తున్నామన్నారు. గోవిదం.. పరమానందం అనే కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానెల్‌ ద్వారా భక్తులకు అందించాలనే ఆశయంతో ఈ నెల 30 రథసప్తమి నాడు ప్రారంభించనున్నట్లు
తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ ద్వారా ప్రసారమయ్యే స్వామి వారి సేవలను వీక్షించి, స్వామి అనుగ్రహం పొందాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr vs jagan
Ill fated costa concordia cruise travelers announced compensation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles