Malnutrition national shame says pm

malnutrition national shame says pm, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

malnutrition-1.gif

Posted: 01/11/2012 10:13 AM IST
Malnutrition national shame says pm

malnutritionదేశంలోని శిశువుల్లో 42 శాతం పోషకపదార్ధాలు అందక బలహీనంగా ఉన్నారన్నది చెప్పుకోవటానికే సిగ్గుచేటు, అంతేకాదు 59 శాతం చిన్న పిల్లలు వారి వయసులో ఉండవలసినంత పొడుగ్గా ఎదగకపోవటం దేశమంతా సిగ్గుపడాల్సిన విషయమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. నాంది (NAANDI) ఫౌండేషన్ వారు ఇచ్చిన ఆకలి, పోషకవిలువలు లేని ఆహారం (HUNGaMA) మీద ఇచ్చిన నివేదిక మీద ప్రధాని పై విధంగా స్పందించారు. ఈ మధ్యకాలంలో సగటు దేశోత్పత్తులు పెరిగినా, ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవటం విచారకరమని ప్రధాని నిన్న న్యూఢిల్లీలో అన్నారు.

నాంది ఫౌండేషన్ నివేదక ప్రకారం ఎత్తు పెరగని పిల్లల్లో సగం మందిలో ఈ లోపం గణనీయంగా ఉంది. పిల్లల ఆహారంలో పోషక విలువలను మరీ పట్టించుకోని రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, రాజస్థాన్ లు ఉన్నాయి. తక్కువ ఆదాయ వనరులున్న కుటుంబాల్లో ముఖ్యంగా ముస్లింలు, ఎస్ సి, ఎస్ టి, వర్గాల్లో ఈ లోపం ఎక్కువగా కనిపించిందని వారి సర్వే నివేదికలో అన్నారు. శిశువ పుట్టినప్పుడు ఉండే బరువుని బట్టి కూడా వారిలో పోషక విలువలుంటాయని కూడా ఈ నివేదిక తెలియజేసింది. సర్వేలో తేలిన మరో విచిత్రమైన విషయమేమిటంటే, 92 శాతం తల్లులకు పోషక విలువలంటే ఏమిటో తెలియదు, శిశువల్లో అది లేకపోవటమన్నది అర్థం కాలేదు. శిశువుల పెంపకంలో ఆడపిల్లల విషయంలో ఆహారంలో పోషక విలువలను చిన్నప్పటి నుంచే పట్టించుకోవటం లేదని కూడా నాంది సర్వే లో తేలింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brhmaputra mail colluded with goods train
Minister mopidevi venkata ramana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles