విశాఖ జిల్లా నిమ్మలగొందిలో మావోయిస్ట్ ల చేతిలో గిరజనుడు హతమారాడు. గిరిజనవాసుల కష్టాలు చాలా కొద్దిమందే అర్థం చేసుకోగలరు. గిరిజనులలో అధికశాతం ఇప్పటికీ చదువుకున్నవారు తక్కువగా ఉండటంతోనూ, బాహ్య ప్రపంచపు పోకడలమీద పూర్తిగా అవగాహన లేకపోవటంతోనూ వారి కష్టాలేమిటో వారికే పూర్తిగా తెలయకుండానే జీవితమంతా గడిపేసేవారు ఎందరో ఉన్నారంటే నాగరిక ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇది పచ్చి నిజం.
గిరిజనులలో కొద్దిగా చదువుకున్నవారిని, వారి గ్రామాలలోని ముఖియాలను మావోయిస్ట్ లు తమ కార్యకలాపాలకు వాడుకుంటారు. మిగతావారిని కూడగట్టటానికి, నమ్మబలకటానికి చదువుకున్న యువత బాగా పనికివస్తారు. వారి మధ్యలో నివసిస్తూనే చదువుకునివున్నవారు కాబట్టి వారి మాటలను మిగతావారు వింటారు. దాని కారణంగా ఆ చదువుకున్నవారు మావోయిస్ట్ లకు దగ్గరవుతారు. వీరి చేతులను అప్పుడప్పుడూ కొద్దిగా తడుపుతూ ఉద్యమకారులు తమ పనులు చేయించుకుంటారు. వారి కార్యకలాపాలను దగ్గరి నుంచి చూసిన ఈ యువకులకు వారి నుండి దూరంగా వెళ్ళటం కానీ వారికి వ్యతిరేకంగా పనిచెయ్యాలని కానీ ఆలోచనే రాదు.
పోనీ అలాగే జీవితమంతా చేసేద్దామా అంటే పోలీసుల నిఘా కూడా ఉంటుంది. ఎక్కువగా వనరులు లేని వారి బ్రతుకులలో కనీసం జోక్యం చేసుకోకుండా ఉంటే బావుంటుందేమో కానీ, ఇటు గిరిజనసంఘాలు (మావోయిస్ట్ లు తయారుచేసినవి), ఇతర రాజకీయ నాయకులు పోలీసులు వారిని ఏ విధంగా వాడుకుందామా అని చూసేవారే కానీ వారి సంక్షేమాన్ని నిజంగా ఆశించేవారు చాలా తక్కువమంది.
ఇక రాజకీయ ఒత్తిడి మొదలవగానే మావోయిస్ట్ లకు సమాచారాన్ని చేరవేస్తున్నారని పోలీసులకు అనుమానం, పోలీసులకు సమాచారాన్ని చేరవేస్తున్నారని మావోయిస్ట్ లకు అనుమానం. ఇరువురూ వారిని హింసించేవారే. ఆ సమయంలో ఎవరు ఏది చెప్తే అది చేసేవారే అధికశాతం ఉంటారు. వారి సొంత జీవితాలను మర్చిపోయి సందిగ్ధంలో పడి వారు ఎవరికోసం పనిచేస్తున్నారో కూడా అర్థంకాని వారు కూడా ఉంటారు. ఆపద వస్తే వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పోలీసులకు చెప్పినా వీరి మాటలమీద పెద్దగా స్పందించరు సరిగదా, నాలుగుసార్లు తిప్పుకుందామని చూస్తారు. గిరిజంన సంఘాలు పేరుకి మాత్రానికే కానీ వీరికి ప్రాతినిధ్యం వహించి వీరి కష్టాలను గట్టెక్కించేవారు అరుదు. రాజకీయనాయకులు ఎప్పుడైనా సందర్శించినా వీరు చెప్పేది జాగ్రత్తగా విన్నట్టే ఉంటారు కానీ ఆ తర్వాత ఏమీ జరగదు. ఇక వీరు చెప్పినా చెప్పకపోయినా వీరికి కూడా తెలియని వీరి కష్టాలను ఏకరువు పెట్టి వీరిలో చైతన్యం తీసుకొస్తున్నామని అనుకుంటూ నూరిపోసే మావోయిస్ట్ లంటే భయం, భక్తి కూడా కలగటం సహజం. ఎవరైనా గిరిజిన వాడలకు వెళ్ళి చూస్తే వాళ్ళకి మన మాటలు అర్థమవుతున్నాయా లేదా అనే అనుమానం వస్తుంది. వారి ముఖాలలో మన మాటలు అర్థమైన సంకేతాలేమీ ఉండవు. కొత్తగా వచ్చినవారెవరో ఎందుకొచ్చిన గొడవ అనుకుని వారి చేతి పనులు, ఇంటి పనుల్లో పడిపోతారు కానీ మాట్లాడటానికి వచ్చినవారి వైపు కూడా సరిగ్గా తలెత్తి చూడరు. దానికి కారణం భయం. వచ్చినవాళ్ళెవరైనా తమని వాడుకోవటం కోసం వచ్చినవారేనని వారి అనుభవం వారిని హెచ్చరిస్తూవుండటమే అందుకు కారణం.
ఈ నేపథ్యంలో మిగతావారిలో భయం కలగటం కోసం, సమాచారాన్ని చేరవేసేవారి పట్ల కఠినంగా ప్రవర్తించటం పోలీసులు, మావోయిస్ట్ లు కూడా చేస్తుంటారు. మావోయిస్ట్ ల శిక్షలైతే ఎక్కువగా మరణ దండనలే ఉంటాయి. నిన్న రాత్రి జరిగిందదే. పోలీసులకు సమాచారాన్ని చేరవేస్తున్నాడనే అనుమానంతో గిరిజనుడి ప్రాణాలు తీసివేయటం జరిగింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more