మానవుల సాంఘిక వ్యవస్థ ఎంతగానో ఆలోచించి ప్రవేశపెట్టిందే. పెళ్ళి, పిల్లలు కలగటంతో బాధ్యత అనేది ఉంటుంది, జీవితంలో సారం పోకుండా ఉంటుంది, కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా వారికో లక్ష్యమంటూ ఏర్పడుతుంది కాబట్టి వారు సమాజాభివృద్ధికి కూడా తోడ్పడతారు కానీ సమాజవిద్రోహానికి పూనుకోరనే పెద్దలు అటువంటి సంస్కృతినిచ్చారు. అయితే పెళ్ళి కానంత మాత్రాన వారు సమాజంలో చీడపురుగులుగా మారి, నాగరిక ప్రపంచాన్ని నివ్వెర పరచేలా అమానుష చర్యలకు పూనుకుంటారని కాదు.
విశాఖపట్నంలో ఒక సీరియల్ కిల్లర్ చిన్నపిల్లలను ఎత్తుకుపోయి బావిలో పడేసి చంపేస్తున్న ఉదంతం పాత గోపాలపట్నం ప్రాంతంలో నివసిస్తున్నవారిని కొంతకాలంగా కలవరపరుస్తోంది. దీనిమీద నిఘా వేసి పోలీసులు నిందితుడినైతే పట్టుకున్నారు కానీ అతని మీద ఎటువంటి కేసూ నమోదు చెయ్యకుండా శిక్ష పడేట్టుగా చెయ్యకుండా ఉండటంతో స్థానికులంతా మీడియాతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఆందోళన చెయ్యగా తప్పని సరి పరిస్థితుల్లో ఆ నిందితుడిని పోలీసులు అందరి ముందుకీ తీసుకురావలసివచ్చింది.
మీడియా ఉన్నదే వివరాలు తీసుకోవటానికి కదా, ఎందుకలా చేసావని అడిగితే, అందరికీ పెళ్ళవుతున్నది, నాకు మాత్రం కాలేదు. ఆ బాధ తనని వేధిస్తున్నదని, అయినా అంతా తన తప్పు కాదు తను తాగే మద్యం చేసిన పని అని చెప్తున్నాడు. పిల్లలను ఎత్తుకుపోయి చంపిన తర్వాత ఎంతగానో బాధపడేవాడట. స్థానికులను అన్నదమ్ముల్లా భావించేవాడట. కానీ మద్యం పడగానే తాను తానుగా ఉండేవాడు కాదట. అదీ నేరస్తుడు అప్పారావు సంజాయిషీ.
ఉయ్యాలలోని పిల్లలు, నెలల పిల్లలనే లక్ష్యంగా పెట్టుకుని హతమార్చిన ఈ నరరూప రాక్షసుడు తప్పిదాన్ని తాగుడు మీదకు నెట్టేస్తున్నాడు. తాగినప్పుడు నేను మనిషిని కాను అంటే, మరి ఆ సమయంలో బావిలో తనే దూకవచ్చు కదా, అలా ఎందుకు చెయ్యడు. ఆ పని చేస్తున్నప్పుడు తనని ఎవరూ కనిపెట్టకుండా జాగ్రత్తపడటం తెలుసు, తనని తాను కాపాడుకోవటం తెలుసు కానీ తాను చేస్తున్నది అమానుష చర్య అని మాత్రమే తెలియదట.
ఇతని వాలకం చూసి రెచ్చిపోయిన స్థానికులు, అతన్ని వదిలెయ్యండి మేము చూసుకుంటాం అని అన్నారు. అది జరిగేది కాదు, ఆమోదయోగ్యం కాదు కాబట్టి నినాదాలతో వదిలేసారు. అయితే అతన్ని కఠినంగా శిక్షించవలసిందేనంటూ మహిళా సంఘాలు పట్టుబట్టాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more