ముంబైలో అన్నా హజారే దీక్షకు హైకోర్టు తీవ్రంగా అభ్యంతరం తెలియజేసింది. పార్లమెంటులో చర్చలు జరుగుతుండగా అదే అంశం మీద సమాంతరంగా ప్రచారం సాగించటం తగదని, అందుకు ఒప్పుకోమని కచ్చితమైన స్వరంలో తెలియజేసింది. ముంబైలో ఎమ్ఎమ్ఆర్ డి ఏ మైదానాన్ని వాడుకోవటానికి చెల్లించాల్సిన రుసుంలో రాయితీ కోసం హైకోర్టుకి వెళ్ళిన అన్నాకు హైకోర్టు పై విధంగా జవాబిచ్చింది. అంతే కాకుండా ప్రభుత్వ విభాగాల కార్యకలాపాల్లో కలుగజేసుకుని వారి విధించే రుసుముల్లో రాయితీలిమ్మని కలుగజేసుకుని అడగబోమని కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది.
లోక్ పాల్ బిల్లు పటిష్టంగా లేకపోతే 27 నుంచి మరోసారి దీక్ష చేస్తానన్న అన్నా హజారే దూకుడుకి కళ్లెం పడింది. ప్రభుత్వం ఎంత దిగిరాగలదో అంత దిగివచ్చింది. ఇక దిగేది లేదని ఖరాఖండిగా చెప్పిన సోనియా గాంధీ మాటలు వాస్తవరూపాలు దాలుస్తున్నాయి.
పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు దాని అంతిమ రూపం ఎలా ఉంటుందో ఎలా చెప్పగలరు. పైగా, మీ కార్యక్రమం ప్రజాప్రయోజనమని మీరు ఎలా అనగలరు. మీ ఆందోళన పార్లమెంటు విధివిధానాలను మార్చివేస్తుందా. లోక్ పాల్ బిల్లు మీద చర్చ జరుగుతోంది, ప్రజా ప్రతినిధుల వాటిమీద నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మీ ఆందోళనకు సత్యాగ్రహమనే పేరు పెట్టారు, కానీ ఇతరులు దాన్నే విసిగించే చర్యగా భావించవచ్చు. అని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయినా, "ప్రత్యామ్నాయంగా పెట్టుకున్న ఆజాద్ మైదనాన్ని ఉపయోగించుకోవటానికి మీకు అభ్యంతరమా?" అని ధర్మాసనం మహరాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని అడిగింది. "అజాద్ మైదానంలో స్థలాభావమున్నందువలనే ఎమ్ఎమ్ఆర్ డిఏ మైదానం ఎన్నుకున్నాం కానీ అంత అద్దె భరించలేకనే రాయితీ కోరుతున్నాం. ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో కూడా అనుమతి లభించింద" ని అన్నా ప్రతినిధులు తెల్పగా, "మరి అక్కడే పెట్టుకోవచ్చుగా మీ నిరాహార దీక్షలు" అని ధర్మాసనం ప్రశ్నించింది.
మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను "ముఖ్యమంత్రిని కానీ మరే బాధ్యతాయుధమైన అధికారిని కానీ అడిగి, ఆజాద్ మైదానం గేట్లు తెరచి జనం కోసం స్థలాన్ని పెంచగలరేమో కనుక్కుని కోర్టుకి తెలియజేయండని, అప్పుడే దీనిమీద సరైన తీర్పుని ఇవ్వగలుగుతా"మని ధర్మాసనం ఆదేశించింది.
ఆజాద్ మైదానంలో అన్నాకి అనుమతించిన స్థలంలో కేవలం 20 వేల మంది మాత్రమే పడతారు. క్రికెట్ లాంటి క్రీడలకు కేటాయించిన స్థలం అన్నా దీక్షకు అనుమతించబోమని చెప్పటంతో అక్కడ స్థలాభావం ఏర్పడుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more