Sonia assures chiranjeevi of suitable post

Sonia assures Chiranjeevi of suitable post, Chiranjeevi called on Sonia Gandhi, national capital, Latest Sonia Gandhi News, Photo Gallery, Video, Tirupati MLA and Praja Rajyam Party President Chiranjeevi

Sonia assures Chiranjeevi of suitable post

Chiranjeevi.GIF

Posted: 12/11/2011 12:41 PM IST
Sonia assures chiranjeevi of suitable post

 Sonia assures Chiranjeevi of suitable post ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి అవిశ్వాస పరీక్షలో ప్రభు త్వానికి అండగా నిలిచిన చిరంజీవికి పెద్దపీట వేయా లని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు. ఢిల్లీలో సిఎంతోపాటు కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్‌ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను సోనియాగాంధీకి నివేదించారు. సోనియా ఇంట జరిగిన భేటీలో చిరంజీవికి సంబంధించి ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది. విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మా నం పెట్టినపుడు చిరంజీవి పార్టీని అన్ని విధాలుగా ఆదుకున్నందున ఇక ఆయనతో పాటు ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్‌ వారిగానే గుర్తించి గౌరవించాలని సోనియా సూచించారు. 

చిరంజీవితో పాటు వర్గం ఎమ్మెల్యేల్లో నెలకున్న అసంతృప్తిని గమనించిన పార్టీ రాష్ట్ర ఇంచార్జి గులాం నబీ ఆజాద్‌ ఎప్పటికప్పుడు వారిని బుజ్జగిస్తూ వచ్చారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ప్రభుత్వానికి చిరుతోపాటు ఆయన వర్గానికి చెందిన 17మంది ఎమ్యెల్యేలు మద్దతు ఇవ్వటంతో పార్టీ అధిష్టానం వద్ద మంచి మార్కులు పడ్డాయి. అధిష్టానంకూడా ఇక చిరంజీవికి ఏదో ఒకటి చేయాలన్న బలమైన అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు.నేపథ్యంలోనే సోనియా వద్ద చిరంజీవి అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. చిరంజీవికి ఇకపార్టీలో పెద్ద పీట వేయటంతోపాటు విధాన పరమైన నిర్ణయాల్లోనూ అయన్ను కలుపుకుని వెళ్ళాలని సూచించినట్టు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సోనియా నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న ప్రాధాన్యం గౌరవం వారికి కూడా ఇవ్వాలని మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

నామినేటెడ్‌ పదవుల్లో కూడా నేతలకు తగిన భాగస్వామ్యం ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణ జరిగితే ఆజాద్‌తోపాటు పీసీసీ అధ్యక్షుడితో చర్చించి చిరంజీవి వెంట వచ్చిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని సోనియా ముఖ్యమంత్రి కిరణ్‌కు సూచించినట్టు సమాచారం. సమయం వచ్చినపుడు చిరంజీవికి కూడా ఆయన గౌరవానికి తగ్గ హోదా కల్పిస్తామని సోనియా చెప్పినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కిరణ్‌ ఢిల్లీ పర్యటన తమకు అన్నివిధాలుగా అనుకూలించిందని, సోనియా గాంధి జోక్యంతో ఇక తమకు పార్టీలోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లోను ప్రాధన్యం లభిస్తుందని చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలు కూడా బలంగా విశ్వసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr very very happy
Second freedom struggle to continue till corruption ends  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles