Kcr very very happy

KCR very, very happy, KCR Latest News, Photos, Biography, Videos and Wallpapers, Telangana Rashtra Samiti (TRS),

KCR very, very happy

KCR.GIF

Posted: 12/11/2011 02:04 PM IST
Kcr very very happy

KCR very, very happyతెలంగాణ రాష్ట్రసాధన కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన స్థానాల్లో జరిగే ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకేనని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పదవులను తృణపాయంగా త్యజించిన వీరులకు భారీ మెజారిటీతో మళ్లీ పట్టం కట్టేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడంతో జోగు రామన్న (ఆదిలాబాద్), గంప గోవర్ధన్ (కామాడ్డి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), టీ.రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్)ల స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు ఆ నలుగురు అభ్యర్థులు జోగు రామన్న, గంప గోవర్ధన్, జూపల్లి కృష్ణారావు, టీ.రాజయ్యలు తమ నియోజగకవర్గాల్లో ఇప్పటికే ప్రచార కార్యక్షికమాల్లో తలమునకలయ్యారు.ఈ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీలు పోటీ చేసినా అది కేవలం నామమావూతమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా తెలంగాణ కోసం టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్‌పై అలుపెరుగని ఒత్తిడి తెచ్చి ఆమోదించుకున్న నాగం జనార్ధన్‌డ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగర్‌కర్నూల్ స్థానంలో పోటీ చేయాలా? వద్దా? అన్న చర్చోపచర్చలు టీఆర్‌ఎస్‌లో సాగుతున్నాయి. 

దాదాపుగా పోటీకి దూరంగా ఉండాలన్న అభివూపాయం వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజేశ్వర్‌డ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానంలో పోటీ విషయాన్ని టీఆర్‌ఎస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన సయ్యద్ ఇబ్రహీంనే ఉప ఎన్నిల్లో పోటీకి దింపాలన్న ప్రతిపాదన పార్టీలో బలంగా వినిపిస్తుంది. అయితే మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీకి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్ గౌడ్ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. రాజకీయ, ఉద్యోగుల జేఏసీల ద్వారా ఆయన కేసీఆర్‌కు రాయబారాన్ని పంపుతున్నట్లుగా చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  2g scam kapil sibal springs to chidambarams defence
Sonia assures chiranjeevi of suitable post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles