Will name indians with swiss accounts in 2012

wikileaks,Wal-Mart,Rudolf Elmer,National Security Agency,Julian Assange

The names of Indians holding Swiss bank accounts may be revealed by WikiLeaks sometime next year, its founder Julian Assange said on Saturday.

Julian Assange.GIF

Posted: 12/04/2011 03:24 PM IST
Will name indians with swiss accounts in 2012

julian-assangeభారత నల్లధర కుబేరుల విదేశీ ఖాతాల వివరాలను త్వరలోనే గుట్టురట్టు చేస్తానని యూఎస్ కేబుల్స్ వికీలిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే వెల్లడించారు. ప్రస్తుతం బ్రిటన్ గృహ నిర్బంధనంలో ఉన్న అసాంజే.. భారత్‌లో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో వీడియో కాన్ఫన్స్ ద్వారా మాట్లాడారు. భారతీయలు స్విస్ బ్యాంకులో దాచిన నల్లధనం గుట్టురట్టు చేస్తానని చెప్పారు.

భారత స్విస్ ఖాతాదారుల సమాచారానికి సంబంధించిన సీడీ తన దగ్గర ఉందని, దీనిని వికీలీక్స్‌కు రహస్య సమాచారాన్ని సేకరించి పంపుతున్న రుడాల్ఫ్ ఎల్మర్ తనకు అందించారని తెలిపారు. అయితే ఎల్మర్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారని, ఈ సంకట పరిస్థితిలో నల్లధన ఖాతాదారుల పేరును తాను బయటపట్టలేనని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తమను తాము కాపాడుకోవడం తమకు ఎంతో ముఖ్యమన్నారు. అయినప్పటికీ.. ఏదో ఒక రోజున భారత నల్లధన కుబేరుల జాబితాను బహిర్గతం చేస్తానని ఆయన ప్రకటించారు. వీటిని వచ్చే ఏడాది ఎప్పుడైనా అకౌంట్ల వివరాలను విడుదల చేస్తానని చెప్పారు. కొన్ని దేశాలు జాతీయ భద్రత పేరిట ఈమెయిళ్లు, ఇంటర్‌నెట్ లావాదేవీలపై నిఘా పెట్టాయని చెప్పారు. ఇదే పనిలో భారత నిఘా సంస్థ ‘రా’ కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan mlas come with us
Bjp trailing behind in bellary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles