కాంగ్రెస్ లో వివాదాల మంత్రిగా మారిన శంకర్ రావు తాజాగా సీఎం కిరన్ కుమార్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నంత వరకు తాను కేబినెట్ సమావేశాలకు వెళ్ళబోనని, ఆయన ముఖం కూడా చూడబోనని చేనేత శాఖ మంత్రి పి. శంకర్ రావు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పటిష్టత కోసం అధిష్టానం ఆదేశానుసారం నడుడుస్తున్న తనను మంత్రి వర్గం నుండి తొలగించే శక్తి ఇక్కడ ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన డుమ్మా కొడుతున్నారు. ఆయన ఆరోపణలకు కొంత మంది మంత్రులు గవర్నర్ నరసింహన్ దాకా వెళ్లి వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖకు కష్టపడి నిధులు తీసుకువస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సరైన విధంగా స్పందించడం లేదని, తన శాఖ ఫైళ్ళను పెండింగ్ లో పెడుతున్నారని, చివరకు నా కార్యాలయానికి సంబంధించిన ఫర్నీచర్ ఫైలును కూడా పెండింగ్ లో పెట్టేశారని ఆయన అన్నారు.
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బయటికి పంపించాకే తాను కేబినెట్ కు వెళతానని ఖరాఖండింగా చెప్పాడు. ఒక మంత్రి అయ్యి ఉండి ముఖ్యమంత్రి స్థాయి అంతటి వాడిని ఇలా అనడం ఎంత వరకు సమంజసం అని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. ఏమైనా శంకర్ రావు మితిమీరి మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more