Love failure

Love Failure, sister in law, Uncle, Love, Cell phone, cell switch off, Bus, marriage, Job, Government Job, small family,

Love Failure

Love Failure.GIF

Posted: 12/03/2011 04:29 PM IST
Love failure

love-failure

సెల్‌నెంబర్ నుంచి ‘హాయ్’ అని మెసేజ్ వచ్చింది. నా ఫ్రెండ్స్ తరచూ కొత్త నెంబర్లు తీసుకున్నప్పుడల్లా ఇలా ఆట పట్టించడం మామూలే. కాని నాకు వచ్చిన ఆ  నెంబర్ మెసేజ్‌లు ఒక అమ్మాయి పంపుతుందేమోనని అనుమానం వచ్చింది. ఆ పర్సన్  కొత్త  అమ్మాయే కాదు నా మరదలని కూడా పసిగట్టాను. ఆ మెసేజెస్‌కి ముందు నేను తనతో క్లోజ్‌గా మాట్లాడిన సందర్భాలు లేవు.

సాధారణంగా అమ్మాయిలతో క్లోజ్‌గా మూవ్ అయ్యే నేను సహజంగానే నా మరదలితో కూడా క్లోజ్‌గా మూవ్ అయ్యాను. నిజానికి తన మీద నాకు ఎలాంటి అభివూపాయం లేదు. జస్ట్ ఒక ఫ్రెండ్, నాకు తగిలిన ఒక గర్ల్ అనుకున్నాను అంతే. రోజులు సెకన్లలా గడుస్తున్నాయి. ఒకరిని విడిచి ఒకరం ఉండలేం అన్నంత స్నేహం(ప్రేమ) పెరిగింది. చాటింగ్‌లో కూడా వేగం పెరిగింది. తనని నేను ‘కన్నా’ అని పిలిచేవాణ్ణి. నువ్వు గ్రేట్ లవర్‌వి కన్నా అని నాకు తను బిరుదు ఇచ్చింది.

అలా ఎనిమిది నెలలు ఎనిమిది క్షణాల్లా కరిగిపోయాయి. తన అల్లరి, కోపం, ప్రేమ నా మనసులో బలంగా నాటుకుపోయాయి. తనని విడిచి ఉండలేని పరిస్థితి వచ్చింది. తన అల్లరిని నేను తప్ప ఎవరూ భరించలేరనే భావన నాలో స్థిరపడిపోయింది. అసలు కథ అప్పుడే మొదలైంది. మా మామయ్య చాలా మంచివాడు. తన కూతురంటే ఆయనకు చాలా ఇష్టం. అంతకంటే ఎక్కువ నమ్మకం. మా పెళ్లి విషయం ఆయన ముందుం చాం. ఆయన ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ క్షణం నుంచి నా జీవితంలో కూడా నిశ్శబ్దం ఆవరించింది. ఆయన నిర్ణయమేంటో చాలా రోజుల వరకు చెప్పలేదు.

మా పెళ్లి మామయ్యకి ఇష్టం లేదని నాకు అర్థమైంది. కారణం... నేను, నా చిన్న ఉద్యోగం, నా చిన్న కుటుంబం, నా పేదరికం. ఎప్పుడూ తండ్రి మాటకు ఎదురు చెప్పని నా ‘కన్న’ నా విషయంలోనూ ఆయన మాటకు ఎదురు చెప్పలేదు. ‘నాన్న ఏం చెప్తే అదే చేస్తాను. నాన్నకు నువ్వు నచ్చలేదు’ అని దీనంగా చెప్పింది. ‘నన్ను మరిచిపో’ అంది. కలవడానికి రావద్దంది. ఏం చేయా లో అర్థం కాలేదు. అన్నిటికీ తాను చెప్పిన సమాధానం ‘నాన్న’. నిస్సహాయంగా ఉండిపోయాను. కుమిలిపోయాను. కన్నీళ్లతో కాలం భారంగా గడుస్తోంది.

ఎన్నో ఆశలతో పెంచుకున్న తన కూతురు బాగుండాలని, మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేయాలనుకున్న మామయ్య నిర్ణయం నూటికి నూరుపాళ్లూ సరైనదనిపించింది. నిజంగా నాకు అర్హత లేదు. అందుకే ఆయన ముందర నిలబడలేకపోయాను. కంటికి కనబడని ప్రేమని అర్హతగా ఎలా చూపించాలి? మంచి సంబంధం వచ్చింది. అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం. తెలిసిన సంబంధమే. మామయ్యకు, అందరికీ నచ్చిన సంబంధం. నెల రోజుల్లో పెళ్లి. నేను చావాలని నిర్ణయించుకున్నాను.

అప్పటికే తనని కలవక చాలా రోజులయ్యింది. తన సెల్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. ఆత్మహత్యకు సిద్ధమయ్యాను. ఈ ఉక్కిరిబిక్కిరి ఉద్వేగాలు, డిప్రెషన్, తను నన్నిక చేరుకోదు అన్న ఫీలింగ్.... జీర్ణించుకోలేక పోయాను. తనతో కలిసి తిరిగిన చోటల్లా పిచ్చివాడిలా తిరిగాను. బస్టాండ్‌లో తను కూర్చున్న కుర్చీ పక్కన కూర్చోని కుమిలిపోయేవాడిని. బస్సు కిటికీలోంచి బయటకు రెపపలాడుతున్న చున్నీ తనదేమోననుకుని వేగంగా వెళుతున్న బస్సు వెనకాల పిచ్చివాడిలా పరుగెత్తేవాడిని.

నా బాధ ఎవరికీ చెప్పుకోలేదు,. కచ్చితంగా ఒక రోజు చావాలని నిర్ణయించుకున్నాను. కాని నా దురదృష్టం ఆ ప్రయత్నాన్నీ తప్పించింది స్నేహితులతో. ఈ వేదనలో ఉన్నప్పుడే తన పెళ్లిరోజు రానేవచ్చింది. ఆమె పెళ్లి మామయ్య అనకున్నట్టుగానే జరిగిపోయింది. నా ప్రేమ నాలోనే మిగిలిపోయింది. తను ఎలా ఉందో, ఎక్కడుందో.... నన్ను ఇప్పటికీ వేధిస్తున్న ప్రశ్నలివి.

తను ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకోవడం తప్ప నేనేమీ చేయలేను. ని..స్స..హా..యు..డి..ని. కానీ కన్నా... నువ్వంటే నాకిప్పటికీ ఇష్టమే. ఎప్పటికీ ఇష్టమే! నీ జీవితంలో నేనొక స్నేహితుడిగానైనా ఉండాలని కోరుకుంటున్నాను.

 ఫ్రెండ్స్..పేమిస్తున్న వాళ్లంతా అది నిలబెట్టుకునే అర్హతనూ సంపాదించుకోండి!’

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shankar rao vs kirankumar reddy
Veena malik isi cover photo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles