Vattitdp mla exchange blows

Denduluru, TDP, MLA, Chintamaneni Prabhakar, tourism minister, Vatti Vasantha Kumar, clashed with each other over a protocol

Denduluru TDP MLA Chintamaneni Prabhakar and tourism minister Vatti Vasantha Kumar clashed with each other over a protocol.

Vatti_TDP MLA exchange blows.gif

Posted: 11/27/2011 02:56 PM IST
Vattitdp mla exchange blows

MLA-Prabhaker_Minister-Vattiపశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చ అయ్యింది. రాష్ట్రమంత్రి వట్టి వసంత కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిలు ఒకే వేదికపై తన్నుకున్నారు. రచ్చబండ కార్యక్రమం నిర్వహించడానికి ఎంపీ కావూరి సాంబశివరావు, మంత్రి వట్టి వసంత కుమార్ దెందులూరులో కు వచ్చారు.

ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేని మంత్రి ఆహ్వానించారు. వేదిక పై ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ... గతంలో తన పై పోటీ చేసి ఓడిపోయిన కోఠారి రామచంద్రారావును ఏ హోదాలో వేదిక పైకి పిలిచారని ప్రశ్నించారు. సొసైటీ అధ్యక్షుడి హోదాలో అని చెప్పేందుకు ప్రయత్నించినా, అది వినని ఎమ్మెల్యే దెందులూరులో జరుతున్న రచ్చబండకు ఎలా ఆహ్వానిస్తారని అన్నారు. అయితే దీని పై ఎంపీ కావూరి మాట్లాడుతూ... పేదవాళ్ళకు సహాయం చేయడానికి పోటీ పడాలే గానీ... చిల్లర పనులు చేయడానికి కాదు అని అన్నారు. దీంతో ఎమ్మెల్యే చింతమనేని అగ్రహానికి గురయ్యారు. దీన్ని శాంతింప చేసేందుకు వచ్చిన మంత్రి వట్టి – ఎమ్మెల్యే ప్రభాకర్ మధ్య మాటల యుద్దం జరిగింది. దీంతో ఇద్దరి  మధ్య తోపులాట జరిగింది.

ఇదంతా చూసిన ప్రజలు మాత్రం రచ్చబండ నిర్వహించేది ఇలా రాజకీయ నాయకులు రచ్చ రచ్చ చేయడానికేనని, ఇలాంటి నాయకులు ప్రజలకు ఏం చేస్తారని, రచ్చబండ కార్యక్రమం అంతటా ఇలానే అవుతుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Court orders fir against ex ips officer kiran bedi
Cpi narayanai will hang pm if i am in rule  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles