Edavalath kakkat janaki ammal biography was an indian botanist who conducted scientific research in cytogenetics and phytogeography

edavalath kakkat janaki ammal news, janaki ammal news, janaki ammal biography, janaki ammal life history, janaki ammal researches, janaki ammal story, janaki ammal history, janaki ammal awards, janaki ammal photos, janaki ammal scientist, telugu news

edavalath kakkat janaki ammal biography was an Indian botanist who conducted scientific research in cytogenetics and phytogeography

వృక్షశాస్త్రంలో జీవకణ నిర్మాణంపై పరిశోధనచేసిన భారతీయ మహిళ

Posted: 11/18/2014 03:28 PM IST
Edavalath kakkat janaki ammal biography was an indian botanist who conducted scientific research in cytogenetics and phytogeography

ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో మహిళలు ఇంకా గౌరవం దక్కని రోజుల్లో ఎందరో మహిళా ప్రతిభావంతులు తమ సత్తా చాటుకుని, ఇతరులకు ఆదర్శంగా నిలిచివారు చాలామందే వున్నారు. అన్నిరంగాల్లోనూ పురుషులకు సమానంగా మహిళలు దూసుకెళ్లారు. అదేవిధంగా శాస్త్రీయరంగంలోనూ తమ ప్రతిభ చాటుకుని, చరిత్రలో చెరగని ముద్రవేసుకున్నారు. అటువంటి ప్రతిభావంతుల్లో ‘ఎడవళత్ కక్కాడ్ జానకీ అమ్మాళ్’ కూడా ఒకరు. ఈమె వృక్షశాస్త్ర శాఖలో సైటోజెనెటిక్స్ (అంటే జీవకణ నిర్మాణం, విధులకు సంబంధించిన శాస్త్రం), భూగోళ శాస్త్రంపై పరిశోధనలు జరిపిన భారతీయ మహిళ! ముఖ్యంగా చెరకు, వంగ చెట్టు మీద పేరెన్నిక పరిశోధనలు జరిపారు.

జీవిత విశేషాలు :

బాల్యం, విద్య, ఉద్యోగ విషయాలు :

1897 నవంబరు 4వ తేదీన చెన్నైలో జన్మించారు. బాల్యంనుంచే విద్యలో మంచి ప్రతిభను కనబరిచిన ఈమె... ఉన్నత చదువులు చదివిన అనంతరం అమెరికాకు వెళ్లారు. అక్కడి మిచిగాన్ యూనివర్సిటీ నుంచి డీఎస్సీ (1931), ఎల్.ఎల్.డీ(1956) డిగ్రీలను అందుకొని, పరిశీలన రంగంలో ఎన్నో విజయాలను తన ఖాతాలో జమచేసుకున్నారు. ఈ విజయాలను సాధించడానికి ముందే ఆమె ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి (మద్రాసు), మహరాజాస్ కాలేజి ఆఫ్ సైన్స్ (త్రివేండ్రం)లలో బోటనీ ప్రొఫెసర్ గా పనిచేశారు.

అయితే అక్కడి విధులు నిర్వహించిన అనంతరం కోయంబత్తూరులో షుగర్ కేన్ రీసెర్చి స్టేషన్ లో చేరిన ఈమె.. అక్కడే  వృక్ష జన్యు శాస్త్రవేత్తగా పరిశోధనలు నిర్వహించడం ప్రారంభించారు. అలా ఆ విధంగా వృక్షశాస్త్ర పరిశోధనల్లో ప్రతిభను గడించిన ఆమె.. తరువాత లండన్ లోని రాయల్ హార్టీకల్చరల్ సొసైటీలో వృక్షకణ శాస్త్ర రంగంలో పరిశోధనలు చేసి కేంద్రక ఆమ్లములలో ఉన్న నత్రజని ఆధారమును విశ్లేషించారు. కణములకు విషపూరితమైన పదార్థములను కనుగొన్నారు.

ఈమె జరిపిన ప్రధాన పరిశోధనలు :

జానకీ అమ్మాళ్ ముఖ్యంగా చెరుకు జన్యుశాస్త్ర విభాగంలో కణాలు, క్రోమోజోముల మీద ప్రధాన పరిశోధనలు జరిపారు. అందులోని ఆయా కణాలకు విషఫలితాలు చేరకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు విషయమై ఈమె నిర్వహించిన పరిశోధనలు నూతన ఆవిష్కరణలు చేశాయి. సూక్ష్మమైన బీజ మాతృకణములను గురించి పలు నూతన అంశములను వెలికి తీసుకువచ్చిన ఘనత ఈమెకే దక్కింది. చెరుకుమొక్కల జీవపరిణామాన్ని తొలిసారిగా అన్వేషించి, జాడ తెలుసుకున్నారు. ఈమె రాసిన గ్రంథం "Chromosome Atlas of the cultivated plant" దేశ విదేశాలలో వృక్ష శాస్త్రవేత్తలకు కల్పతరువు వలె భాసిల్లింది.

ఈమె అందించిన ఇతర సేవలు :

బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (కలకత్తా) స్పెషల్ ఆఫీసర్ గా నియమితులై నూతన సంవిధానంలో పునర్నిర్మాణం చేశారు. సెంట్రల్ బొటానికల్ లేబొరేటరీ (అలాహాబాద్) కు డైరక్టర్ గా ఉండి సమున్నత పరిచారు. రీజినల్ రీసెర్చి లేబొరేటరీ (జమ్ము), బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ (బొంబాయి), సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (బొంబాయి) తదితర ప్రసిద్ధ వైజ్ఞానిక సంస్థలకు గౌరవ శాస్త్రవేత్తగా ఉండి బహుముఖ సేవలు అందించారు. ఇలా ఈమె అందించిన సేవలకుగాను ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి.

అవార్డులు, పురస్కారాలు :

ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (1957), లినేయం సౌసైటీ (బ్రిటన్), రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ (లండన్), జెనెటిక్ సొసైటీ ఆఫ్ అమెరికా, రాయల్ హార్టీ కల్చరల్ సొసైటీ (లండన్) మొదలైన పలు దేశ, విదేసీ ప్రతిష్టాత్మక సంస్థల్లో తనవంతు కృషి అందించినందుకుగానూ ఆ సంస్థలు జానకీ అమ్మాళ్ కు గౌరవ ఫెలోషిప్ ను అందించాయి. ఈమె బొటానికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కు కార్యదర్శిగా 91933 - 38), గౌరవ అధ్యక్షురాలుగా (1960) గాను, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ కు ఉపాధ్యక్షురాలుగా (1961-64) వుండి ఆయా సంస్థల పురోభివృద్ధికి అఖండ కృషి చేశారు. అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థలు సిగ్మా -XI అసోషియేషన్ ఆఫ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ మొదలైనవి ఈమెకు పలు గౌరవ పురస్కారాలను అందించాయి. 1961లో ‘‘బీర్బల్ సహాని’’ మెడల్, 1977లో ‘పద్మశ్రీ’ వంటి గౌరవ పురస్కారాలను ఈమె అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles