Jhansi lakshmi bai biography

jhansi lakshmi bai news, jhansi lakshmi bai life history, jhansi lakshmi bai wiki, jhansi lakshmi bai wikipedia, jhansi lakshmi bai wikipedia in telugu, jhansi lakshmi bai story, jhansi lakshmi bai life story, jhansi lakshmi bai history, jhansi lakshmi bai photos, jhansi lakshmi bai kingdom, indian freedom fighters, telugu news

jhansi lakshmi bai biography who is one of the famous indian freedom fighter

మొదటి స్వాతంత్ర్యసంగ్రామంలో ప్రముఖపాత్ర పోషించిన ‘ఝాన్సీ’!

Posted: 11/19/2014 04:27 PM IST
Jhansi lakshmi bai biography

భారతదేశంలో బ్రిటీష్ వారి ఆగడాలు ప్రారంభమైన తొలినాళ్లలోనే వాళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించిన భారతసమరయోధుల్లో ఒకరైన ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ కీలకపాత్ర పోషించింది. 1857లో  భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఒకరైన ఈమె.. ఇతరు యోధులకు గుర్తుగా నిలిచింది. భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.

జీవిత విశేషాలు :

1828 నవంబర్ 19వ తేదీన మహారాష్ట్రకు చెందిన ‘సతర’లో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయిలు. రాణి అసలు పేరు మణికర్ణిక. అయితే ఆమెను ముద్దుగా ‘మను’ అని పిలుచుకునేవారు. రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. అటువంటి కష్టసమయాల్లో బాజీరావు పీష్వా, మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేనికారణంగా నానా సాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వండి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ.

లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మార్చడం జరిగింది. 1851లో లక్ష్మీబాయి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బంధువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. అయితే తర్వాతిరోజే రాజు తుదిశ్వాస విడిచారు.

రాజ్యం ఆక్రమణ :

రాజు గంగాధర్ రావు మరణానంతరం ఆయన కుమారుడైన దామోదర్ రావు వారసుడు కావాల్సి వుండేది. కానీ బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. అతను దత్తత తీసుకోబడ్డ కుమారుడు కాబట్టి.. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డెల్హౌసి, సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని అతనిని నిరాకరించాడు. దాంతో ఆగ్రహానికి గురైన లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. తమ మీద దావా వేసిందని ఆంగ్లేయులంతా రాణి మీద కక్ష పెంచుకున్నారు. ఆమెను రాజ్యాన్ని అపహరించి, ఆమెను బహిష్కరించాలని పన్నాగం పన్నారు. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అందాల్సిన డబ్బును కూడా ఇవ్వకుండా దోచేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది.

స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర :

ఒకవైపు ఝాన్సీలో రాణి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి శిక్షణా తరగతులను, ఇతర ఏర్పాట్లను సిద్ధం చేస్తుండగా.. మరోవైపు 1857 మే 10లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా చరిత్రలో నిలిచింది. అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకొన్నారు. ఇంతలో మే 1857లో భారతదేశంలో కలవరం ప్రాకడం మొదలైంది. ఉత్తరఖండంలో మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధం మొదలైంది. ఆ విషయాన్ని తెలుసుకున్న రాణి.. తన సత్తాని చాలా వేగంగా ప్రదర్శించి ఝాన్సీ యుద్ధానికి సేనలను సమర్థవంతంగా తయారుచేసింది. అలాగే 1858 మార్చి 23లో బ్రిటిష్ బలగాలు సర్ హుఘ్ రోజ్ వంశములో ఝాన్సీని ఆక్రమించుకున్నప్పుడు ఆమె ఆమె యుద్ధ వీరులతో కలిసి రెండువారాలపాటు యుద్ధంలో పాల్గొంది. ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది.

ఝాన్సీకి స్వేచ్చ కలిగించి లక్ష్మిబాయిని స్వతంత్రుపరురాలు చేయటానికి తిరుగుబాటుదార్ల నాయకుడైన తాత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం పంపబడింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నాకాని... వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టడంతో, ఈ అనుభవంలేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగాయి. ఆమె తన రక్షకులు చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోగలిగింది. 1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. అయితే 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్నబిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది.

మరణం :

1858 జూన్ 18లో గ్వాలియర్ తో యుద్ధ సమయములో మరణించింది. అది గ్వాలియర్లోని ఫూల్ బాఘ్ దగ్గర కోతః-కి-సేరి లో జరిగింది. ఆమె యుద్ధ వీరులకు యుద్ధ బట్టలు తొడిగించి గ్వాలియర్ కోటను రక్షించటానికి యుద్ధానికి తీసుకెళ్ళింది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు గ్వాలియర్ ను ఆక్రమించుకొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : jhansi lakshmi bai  indian freedom fighters  1857 india revolution  telugu news  

Other Articles