Bhanumathi ramakrishna jayanthi special

bhanumathi ramakrishna jayanthi Special, Bhanumathi Jayanthi today, Paluvayi Bhanumathi Ramakrishna, Bhanumathi Jayanthi Special

bhanumathi ramakrishna jayanthi Special, Bhanumathi Jayanthi today, Bhanumathi Jayanthi Special 2013

భానుమతి రామకృష్ణ గారి జయంతి

Posted: 10/07/2013 04:41 PM IST
Bhanumathi ramakrishna jayanthi special

పూర్తి పేరు : పాలువాయి భానుమతీ రామకృష్ణ

 

జననం : 07-09-1925

 

జన్మస్థలం : ప్రకాశం జిల్లా, ఒంగోలు తాలూకా, దొడ్డవరం గ్రామం

 

తల్లిదండ్రులు : సరస్వతమ్మ, బొమ్మరాజు వెంకట సుబ్బయ్య

 

వివాహం - భర్త : 08-08-1943 - రామకృష్ణారావు

 

సంతానం : కుమారుడు (భరణి)

 

నటిగా తొలిచిత్రం : వరవిక్రయం (1939)

 

ఆఖరిచిత్రం : పెళ్లికానుక (1998)

 

చిత్రాలు : దాదాపు 100 (తెలుగు, తమిళం, హిందీ, కన్నడం)

 

గాయకురాలిగా తొలిచిత్రం - పాట : వరవిక్రయం - పలుకవేమి నా దైవమా, ఆఖరిచిత్రం - పాట : పెళ్లికానుక - ‘బంగారుబొమ్మకు’ పాట బాలుతో

 

పాటలు : సుమారు 250 పైగా సంగీత దర్శకురాలిగా తొలిచిత్రం : చక్రపాణి

 

(1954), ఆఖరిచిత్రం : అసాధ్యురాలు (1993)

 

చిత్రాలు : 11

 

దర్శకత్వం వహించిన సినిమాలు : 6 (కొన్ని మధ్యలో ఆపేశారు)

 

 

భానుమతి తల్లిదండ్రులిద్దరూ సంగీతంలో ప్రవేశమున్నవారే. సంగీతంలో తన తొలిగురువు తండ్రి కావడం విశేషం. ఆమెకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అంటే ఎంతో అభిమానం. ఒకసారి త్యాగ రాజ ఆరాధనోత్సవాల సమయంలో తిరువాయూరు లో సుబ్బులక్ష్మితో కలిసి ‘ఎందరో మహానుభావులు’ కీర్తన పాడే అవకాశం లభించింది. ఆ గాత్రమాధుర్యం సినీరంగంలోని ప్రముఖల దృష్టిని ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి గాయకునిగా, నటిగా, సంగీత దర్శకులురాలిగా, నిర్మాతగా, రచయిత్రిగా సినిమా రంగంలో తన ప్రతిభను అన్నివిధాలా చాటుకున్నారు.

 

చలనచిత్ర పరిశ్రమలోనూ, సాహితీరంగంలోనూ విశిష్ఠమైన వ్యక్తి భానుమతీరామకృష్ణ. అందువల్లనే ఆల్‌రౌండర్‌ కాగలిగారు. తొలుత తన 13వ ఏటనే తండ్రి నుంచి సంగీతాన్ని అభ్యసించారు. సినీరంగంలోకి అడుగిడినా చాలకాలం తండ్రికూచిగానే వ్యవహరించారు. 14వ ఏట 'వరవిక్రయం' చిత్రంలో నటిగా చిత్రరంగ ప్రవేశం చేసారు. అసిస్టెంట్‌ డైరక్టర్‌ రామకృష్ణని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పరుల సహకారంతో పెళ్ళి అయ్యాక సాధారణంగా గృహ జీవితంలో తృప్తిపడతారు మహిళలు. భానుమతి అలాకాకుండా నటనను కొనసాగించారు కొంత గ్యాప్‌ యిచ్చి. భరణి సంస్థను నెలకొల్పి 'రత్నమాల' చిత్రాన్ని తొలిసారిగా నిర్మించి 1947లో విడుదల చేసారు. భరణి స్టూడియోస్‌ని నెలకొల్పారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. పాటలు పాడారు. అంతేకాదు సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, చిత్రకారిణిగా, జ్యోతిష్కురాలిగా ప్రజ్ఞా పాటవాలు చూపారు. ఇక రచయిత్రిగా అత్తగారి కథలు ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డుని పొందింది. 'నాలో నేను' అనే స్వీయ చరిత్ర ఉత్తమ జీవితచరిత్రగా కేంద్రప్రభుత్వం నుంచి అవార్డుని తెచ్చింది. మద్రాసు సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసారు.

 

గౌరవపురస్కారాలు : ఉత్తమనటిగా 1956లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవార్డు, తమిళ ప్రభుత్వం నుండి 1956లో ‘నడిప్పుక్క ఇలక్కణం’, 1960లో ‘కలైమామణి’ బిరుదులతో సత్కరించారు. తాను రాసిన ‘అత్తగారి కథలు’ కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1966లో పద్మశ్రీ, 1975లో ఆంధ్రయూనివర్సిటీ నుండి ‘కళాప్రపూర్ణ’, 1986లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1998లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, 2004లో ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు, మరెన్నో అవార్డులు అందుకున్నారు.

 

 

మరణం : 24-12-2005

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles