Alka yagnik playback singer interview

Alka Yagnik playback singer Interview, Alka Yagnik Interview, Alka Yagnik, Alka Yagnik interview, celeb interview

Alka Yagnik playback singer Interview, Alka Yagnik Interview, Alka Yagnik, Alka Yagnik interview, celeb interview

అల్కా యాగ్నిక్‌ గురించి

Posted: 09/02/2013 06:05 PM IST
Alka yagnik playback singer interview

ఆమె గొంతు ఓ కొకిక స్వయం కంటే తీయగా ఉంటుంది... ఈమె పాట వింటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది... ఈమె ఏ భాషల్లో పాడినా పాటలోని మాధుర్యం మాత్రం మిస్సవ్వదు. హిందీ సినీ సంగీతాభిమానులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని గాయనీ.. ఆమె అల్కా యాగ్నిక్‌. హిందీ, తెలుగు, తమిళం వంటి భాషల్లో పాడి కళాకారులకు ప్రాంతీయ, భాషా వంటి అవరోధాలు అడ్డు కావని నిరూపించింది. తన సినీ కెరీర్‌లో దాదాపు 800చిత్రాలలో, 20 వేలకు పైగా పాటలను పాడి తనదైన ముద్రవేసుకున్నారు. 80వ దశకం నుంచి మంచి గాయనిగా సంగీత ప్రేమికులను అలరిస్తోన్న అల్కా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోగలిగింది. 3 సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డును సాధించిన అల్కాగురించి కొన్ని విషయాలు.

అల్కా యాగ్నిక్‌ కలకత్తాలో 1966 మార్చి 20న ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించారు. అమె తల్లి ‘శుభా యాగ్నిక్‌’కు శాస్ర్తీయ సంగీతంలో ప్రవేశం ఉంది. అల్కా తన ప్రాధమిక విద్యాభ్యాసాన్ని ‘మోడ్రన్‌ హై స్కూల్‌ ఫర్‌ గర్ల్‌‌స’ నుంచి పూర్తి చేశారు.తన ఆరవ ఏటనే అమె ‘ఆల్‌ ఇండియా రేడియో’లో పాటను పాడారు. అల్కా యాగ్నిక్‌ హిందీ చిత్రసీమతో పాటు దేశంలోని వివిధ భాషలలో ఎన్నో అద్భుతమైన పాటలను పాడిన గాయని. వివిధ భాషలలో ఆమె నేటి వరకు 800కు పైగా చిత్రాలలో పాడారు. దాదాపు 20 వేలకు పైగా పాటలకు గాత్రం అందించారు. అల్కా యాగ్నిక్‌ ప్రతిభకు ఏడు సార్లు ఫిలింఫేర్‌ అవార్డులు వరించాయి. రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డులు సాధించారు.

అల్కా యాగ్నిక్‌ కలకత్తాలో 1966 మార్చి 20న ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించారు. అమె తల్లి ‘శుభా యాగ్నిక్‌’కు శాస్ర్తీయ సంగీతంలో ప్రవేశం ఉంది. అల్కా తన ప్రాధమిక విద్యాభ్యాసాన్ని ‘మోడ్రన్‌ హై స్కూల్‌ ఫర్‌ గర్ల్‌‌స’ నుంచి పూర్తి చేశారు.తన ఆరవ ఏటనే అమె ‘ఆల్‌ ఇండియా రేడియో ’లో పాటను పాడారు. అల్కా వయసు 10 సం ఉన్నప్పుడు వారి కుటుంబం ముంబాయికి మకాం మార్చారు. అప్పుడు ఆమెకు నటుడు రాజ్‌కుమార్‌తో పరిచయం జరిగింది. ఆయన అల్కా ను సంగీత దర్శకుడు లక్ష్మీకాంత్‌ వద్దకు పంపారు. ఆయన ఆమెకు ప్లేబ్యాక్‌ సింగర్‌గా అవకాశం ఇచ్చారు.

శాస్ర్తీయ సంగీతంలో ప్రవేశం ఉన్న అల్కా యాగ్నిక్‌ బాలీవుడ్‌లో మంచి గాయనీ మణులలో ఒకరు. 1980 కాలం నుంచి మొద లైన ఆమె మాయ నేటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. అల్కా ‘ఆల్‌ ఇండియా రేడియో ’లో భజనలను పాడటంతో తన కెరియర్‌ను ప్రారంభించింది. 1979లో వచ్చిన ‘ప్యార్‌ కి ఝన్‌ కార్‌’ చిత్రంలో ఆమె సినీ జీవితం మొదలైంది. తరువాత ‘లావారిస్‌’ చిత్రంలో  ‘మెరె అంగ్‌నేమే ’ పాట సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆమె కెరీర్‌ గ్రాఫ్‌ ఓ రేంజ్‌లో ఎగిసింది. తరువాత ఆమె ‘ మేరి బహూ అల్కా ’ అనే చిత్రంలో పాడారు.

అప్పటికే మంచి గాయనిగా గుర్తింపు సాధించిన అల్కా యాగ్నిక్‌కు ‘తేజాబ్‌’ (1988)లో ‘ఎక్‌ దో తీన్‌’ అనే పాటతో మంచి గుర్తింపు వచ్చింది. అల్కా యాగ్నిక్‌ గళం, మాధురి దీక్షిత్‌ స్టెప్స్‌ మేళవింపుతో ఈ పాట నేటికీ హవాను కొనసాగిస్తోంది. ఈ పాటకు ఆమెకు ఫిలింఫేర్‌ ఉత్తమ గాయనీ అవార్డు వరించింది. తరువాత ‘ఖయామత్‌ సే ఖయామత్‌’ చిత్రం కూడా టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

80వ దశకం నుంచి మంచి గాయనిగా సంగీత ప్రేమికులను అలరిస్తోన్న అల్కా తన కెరీర్‌లో ఎంతో మంది ప్రముఖులతో కలిసి పని చేశారు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌, పూరి జగన్నాథ్‌ ,హిమేష్‌ రేషమ్యా ,ఆనంద్‌ రాజ్‌ ఆనంద్‌, సాజిద్‌ వాజిద్‌ ,లలిత్‌ పండిత్‌, శంకర్‌ఎహసాన్‌ లాయ్‌, ప్రీతం, అను మలిక్‌ వంటి దర్శకులతో పాటు, సోనూ నిగం ఉదిత్‌నారాయణ్‌, హరిహరణ్‌, షాన్‌, హిమేష్‌ రేషయ్యా వంటి గాయకులతో యుగళ గీతాలను పాడారు.

కళాకారులకు ప్రాంతీయ, భాషా వంటి అవరోధాలు అడ్డు కావలని నిరూపించారు అల్కాయాగ్నిక్‌. తన సినీ కెరీర్‌లో దాదాపు 800చిత్రాలలో, 20 వేలకు పైగా పాటలను పాడారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మణిపురి,మలయాళం, అస్సామీ,మరాఠీ, పంజాబి, భోజ్‌పురి, ిబెంగాలి, నేపాలి, రాజస్తానీ, ఒరియా, గుజరాతీ వంటి 14 భాషల్లో పాడారు.హించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles