Indian table tennis player neha aggarwal

Table Tennis Player Neha Aggarwal, Indian Table Tennis Player Neha Aggarwal, Olympics in Beijing,

Indian Table Tennis Player Neha Aggarwal

టేబుల్‌ టెన్నీస్‌లో భారత మెరుపు తీగ

Posted: 06/15/2013 06:26 PM IST
Indian table tennis player neha aggarwal

చిన్ననాటి నుంచే ఈ క్రీడలో రాణిస్తూ.. అంతర్జాతీయంగా పతకాలు సాధించిన యువక్రీడాకారిణి నేహా అగర్వాల్‌...నేహా అగర్వాల్‌ మన దేశ టెబుల్‌ టెన్నీస్‌ క్రీడాకారిణి. 2008లో బిజింగ్‌లో వేసవిలో జరిగిన ఒలంపిక్స్‌లో భారత్‌ నుంచి గుర్తింపు పొందిన మెరుపు తునక. విచిత్రమేమిటంటే ఈ ఒలంపిక్స్‌లో భారత్‌ తరుఫున పాల్గొన్న ఒకే ఒక టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నేహానే. మౌమాదాస్‌, పొలోమీ ఘాతక్‌లను ఒడించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ నుంచి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన నేహా కలకత్తా, అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ జూనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ను సాధించడంతో వెలుగులోకి వచ్చింది. చైనీస్‌, ఆస్ట్రేలియాలో జరిగిన క్రీడల్లో ఓటమిని చవిచూసింది.

బీజింగ్‌ ఒలింపిక్స్‌లో భాగంగా జరిగిన మహిళల టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో భారత క్రీడాకారిణి నేహా అగర్వాల్‌ తొలిరౌండ్‌లోనే వెనుతిరిగింది. ప్రత్యర్థిని నిలువరించడంలో కాస్త పోరాట పటిమ ప్రదర్శించినా చివరకు నేహా వెనుతిరగాల్సి వచ్చింది. 2016లో జరిగే టెబుల్‌ టెన్నీస్‌లో భారత్‌ తరఫున బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా శిక్షణ పొందుతోంది. అంతేకాకుండా ఈసారి జరిగే టోర్నమెంట్‌లో ఖచ్చితంగా రాణించాలని, ఇంతవరకు ఆడిన అన్నీ మ్యాచ్‌లు తరువాత ఆడే మ్యాచ్‌లకు ఉపయోగపడతాయన్నారు. గతంలో ఎవరూ అందుకోలేని విజయాలను సాధించాలని, ఒలింపిక్స్‌లో తాను సాధించిన విజయాలను అభిమానులు కలకాలం గుర్తుంచుకోవాలన్నదే తన లక్ష్యంగా భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles